Abn logo
Oct 17 2021 @ 23:26PM

భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

పట్టుబడిన మద్యం సీసాలతో ఎక్సైజ్‌ అదికారులు

గురజాల అక్టోబరు 17: గురజాల ఎక్సైజ్‌ పోలీసుస్టేషన పరిదిలో ఆదివారం దాడులు నిర్వహించి ఓ మినీలారీలో తరలిస్తున్న 3,360 తెలంగాణ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుందని అడిషనల్‌ ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు. దాడులలో ఎస్‌ఈబీ సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్లు ఈఎస్‌ చంద్రశేఖరురెడ్డి తెలిపారు.

పిడుగురాళ్లలో..

పిడుగురాళ్ల: పట్టణంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జి వద్ద ఆదివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో తెలంగాణా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్ల ఎస్‌ఐ సమీర్‌బాషా తెలిపారు. మాచవరం మండలం నాగేశ్వరపురం తండాకు చెందిన మెఘావత రంగానాయక్‌ కారులో రూ.47,550 విలువైన 226 తెలంగాణా మద్యం బాటిళ్లను తరలిస్తుండగా వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.