తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం పాత పాట

ABN , First Publish Date - 2021-11-24T04:28:53+05:30 IST

తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం పాత పాటే పాడింది. పార్‌ బాయిల్డ్ రైస్‌ తీసుకోబోమని తేల్చి చెప్పింది. ధాన్యం సేకరణ విషయంలో...

తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం పాత పాట

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ధాన్యం కొనుగోలుపై కేంద్రం పాత పాటే పాడింది. పార్‌ బాయిల్డ్ రైస్‌ తీసుకోబోమని తేల్చి చెప్పింది. ధాన్యం సేకరణ విషయంలో ఎటూ తెలకుండానే కేంద్రమంత్రి గోయల్‌తో తెలంగాణ బృందం భేటీ జరిగింది. ఈనెల 26న తెలంగాణ బృందంతో మరోసారి భేటీ కావాలని యోచిస్తున్నారు. అదే రోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు సీజన్లలో 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఏ సీజన్‌లో ఎంత ఉంటుందో చెప్పాలని కేంద్రం కోరింది. కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌తోనూ తెలంగాణ బృందం భేటీ అయింది. తోమర్ దగ్గరకు తెలంగాణ బృందాన్ని పీయూష్ గోయల్  స్వయంగా తీసుకువెళ్లారు. ఎప్పుడు ఎంత ఉత్పత్తి అవుతుందో స్పష్టంగా చెప్పాలని కేంద్రమంత్రులు తెలిపారు. ఒక నిర్దిష్ట అంచనాతో వస్తే..నిర్ణయానికి రావొచ్చని గోయల్ అన్నట్లు సమాచారం. ఈనెల 26న మరోసారి భేటీకి పీయూష్‌ గోయల్‌ సుముఖం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-11-24T04:28:53+05:30 IST