Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 11 2021 @ 17:46PM

‘తెలంగాణ తల్లి’ని బంధ విముక్తురాలిని చేయాలి: బండి సంజయ్

హైదరాబాద్: కేసీఆర్ పాలన నుంచి బంధ విముక్తి చేయమని.. తెలంగాణ తల్లి గోషిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం ఆయన జోగిపేటలో ప్రసంగించారు. అమరుల త్యాగాల వల్ల తెలంగాణ రాష్టం సాధిస్తే.. నేడు రాష్టంలో కుటుంబపాలన సాగుతోందని చెప్పారు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య ఆత్మలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయని తెలిపారు. కేసీఆర్‌కు పసి పిల్లలు, అమరవీరుల తల్లిదండ్రుల పాపం తగులుతుందన్నారు. దళితులను మోసం చేయడం, కులవృత్తులను నిర్వీర్యం చేయడం వంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.


రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని.. అలాగే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తుంటే.. కేసీఆర్ మాత్రం ఏమీ చేయడం లేదని విమర్శించారు. అంబేడ్కర్‌ను గౌరవించింది.. బీజేపీ ఒక్కటే అని చెప్పారు. కేసీఆర్‌కు.. అంబేడ్కర్ జయంతి, వర్ధంతులు గుర్తుకు రావన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రమని చెబుతూ.. ప్రజలను మోసం చేశాడన్నారు. ఫామ్‌హౌస్, ప్రగతి భవన్‌లో మినహా రాష్ట్రంలో పాలన పడకేసిందని ఎద్దేవాచేశారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


ప్రజా సంక్షేమం కోసమే పాదయాత్ర

రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట ఎన్నికల వ్యవహార ఇన్‌చార్జ్ విజయ్ వర్గీయా అన్నారు. తెలంగాణ ప్రజలు.. బీజేపీ వైపు ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వ్యవస్థ నడుస్తోందని ఆయన విమర్శించారు.

Advertisement
Advertisement