తెలంగాణ ఉద్యమ దీప్తి

ABN , First Publish Date - 2020-08-06T07:50:00+05:30 IST

ప్రత్యేక తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. ఆర్‌ఎ్‌సయూ నుంచి ఆర్‌ఎ్‌సఎస్‌ వరకు అన్ని వర్గాలను కలుపుకొంటూ 5 దశాబ్దాలుగా

తెలంగాణ ఉద్యమ దీప్తి

తెలంగాణ జాతిపిత.. ఆచార్య జయశంకర్‌ జయంతి నేడు

హన్మకొండ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు. ఆర్‌ఎ్‌సయూ నుంచి ఆర్‌ఎ్‌సఎస్‌ వరకు అన్ని వర్గాలను కలుపుకొంటూ 5 దశాబ్దాలుగా ఉద్యమానికి మార్గదర్శనం చేసిన ధ్రువతార ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌. గురువారం ఆయన జయంతి. 1934 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో విశ్వబ్రాహ్మణ కులంలో జయశంకర్‌ జన్మించారు. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆజన్మ బ్రహ్మచారి.  అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. తెలంగాణ జాతిపితగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. జయశంకర్‌కు సిద్ధాంతకర్త అని పేరు. కానీ ఆయన ఎన్నడూ తనను తాను అలా అనుకోలేదు. తన ఆలోచనా విధానాన్ని సుస్పష్టం చేస్తూ దానిని ఆచరిస్తూ మార్గదర్శిగా నిలిచారు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని తన ప్రసంగాల ద్వారానే కాక రచనల ద్వారా కూడా ప్రజలను చైత్యన్యపర్చారు.  ఆయన రచనలే తెలంగాణ ఉద్యమ చరిత్రకు బోధనకు పాఠ్యగ్రంఽథాలయ్యాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడితే ఈ ప్రాంతం అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుందన్న ఆయన ధృఢ అభిప్రాయం వాస్తవ రూపం దాల్చుతోంది. తెలంగాణ వస్తే మొదటగా చెరువులను పునరుద్ధరించుకోవాలని, అప్పుడు గ్రామీణ వ్యవవస్థ సస్యశ్యామలమవుతుందని ఆయన కన్న కలలు సాకారమవుతున్నాయి. గోదావరిపై నిర్మాణమైన కాళేశ్వరం భారీ ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణ. తాను కలలు కన్న ప్రత్యేక రాష్ట్రాన్ని కళ్లార చూడకుండానే 2011 జూన్‌ 21న ఆయన కన్నుమూశారు.

Updated Date - 2020-08-06T07:50:00+05:30 IST