Abn logo
Sep 24 2021 @ 17:08PM

తెలంగాణకు చుక్కెదురు

హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తెలంగాణకు చుక్కెదురైంది. ఎన్జీటీ సంయుక్త కమిటీ షాకింగ్ రిపోర్టులు వెలుగులోకి వచ్చాయి. పాలమూరు ప్రాజెక్ట్‌లో సాగునీటి ప్రాజెక్ట్‌ పనులు కూడా జరుగుతున్నాయని ఎన్జీటీ సంయుక్త కమిటీ తేల్చింది. పాలమూరు అక్రమ ప్రాజెక్ట్‌ అంటూ ఏపీ రైతులు ఎన్జీటీని ఆశ్రయించింది. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులే లేవని ఏపీ రైతులు అంటున్నారు. పాలమూరు రంగారెడ్డి పథకం కేవలం తాగునీటి కోసమేనని తెలంగాణ చెబుతోంది. నిజనిర్ధారణ కోసం ఇటీవల సంయుక్త కమిటీని  ఎన్జీటీ నియమించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను సంయుక్త కమిటీ సందర్శించింది. సాగునీటి కోసం కూడా పనులు జరుగుతున్నాయని సంయుక్త కమిటీ నివేదికలో పేర్కొంది. తుది నివేదిక కోసం సంయుక్త కమిటీ 8 వారాల గడువు కోరింది.