Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం పట్ల ఎన్నారైల హర్షం

ఫిలడెల్ఫియా: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం పట్ల పలువురు ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకోవడం తెలంగాణ రాజకీయాలలో కీలక ఘట్టంగా తెలంగాణకు చెందిన పలువురు ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. ఫిలడెల్ఫియాలోని హౌస్ ఆఫ్ బిర్యానీ రెస్టారెంట్‌లో జులై 8న(గురువారం) జరిగిన సమావేశంలో దాదాపు వంద మందికి పైగా ఎన్నారైలు పాల్గొని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. నిజాం నవాబు మాదిరి పరిపాలన జరుగుతున్న తెలంగాణలో ప్రజల కోసం, యువకుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మాట్లాడే గొంతుకగా నిలిచిన పోరాట యోధుడు ఎంపీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం జరగాలని ఆకాంక్షించారు. 

ఈ సమావేశంలో ఆటా మాజీ అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి, తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు సురేష్ రెడ్డి, తానా ప్రధాన కార్యదర్శి రవి పొట్లూరి, ఫిలడెల్ఫియా తెలంగాణ సంఘం మాధవ్ రెడ్డి, నాటా లక్ష్మి నరసింహా రెడ్డి, రవి మందలపు, ప్రసాద్ కునారపు, నరసింహా దొంతిరెడ్డి, ఉజ్వల్, రమణ, గిరిధర్ రెడ్డి, సాంబయ్య, జగదీశ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, సతీష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement