తెలంగాణ పోలీస్‌ దేశానికే ఆదర్శం: జగదీష్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-22T01:20:13+05:30 IST

తెలంగాణ పోలీస్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి కొనియాడారు. నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయం

తెలంగాణ పోలీస్‌ దేశానికే ఆదర్శం: జగదీష్‌రెడ్డి

నల్లగొండ: తెలంగాణ పోలీస్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి జగదీష్‌రెడ్డి కొనియాడారు. నల్లగొండ జిల్లా పోలీస్‌ కార్యాలయం, 12వ బెటాలియన్‌లో గురువారం నిర్వహించిన పోలీస్‌ అమరుల స్మృతి పరేడ్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, మహిళల రక్షణ, నేర విచారణ, నేరస్థులకు శిక్ష పడేలా చేయడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచిందన్నారు. దేశ రక్షణలో జవాన్లు, రాష్ర్టాల్లో పోలీసులు తమ జీవితాలను సమాజంకోసం అర్పించడం అభినందనీయమని ప్రశంసించారు.  శాంతిభద్రతలు సమర్ధంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ శాఖ పాత్ర అత్యంత కీలకమని గుర్తించిన తొలి పాలకుడు సీఎం కేసీఆరేనని జగదీష్‌రెడ్డి చెప్పారు.

Updated Date - 2021-10-22T01:20:13+05:30 IST