Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణలో పెరగనున్న RTC ఛార్జీలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 25 పైసలు, ఇతర బస్సుల్లో 30 పైసలు మేర ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గత నెల ధరల ప్రపోజల్స్‌ను తయారు చేసి సీఎంకు అందించినట్లు తెలిపారు. లాంగ్ డిస్టన్స్ రూట్‌లలో బస్సులను నడపడం వల్ల లాభాలు వస్తాయని సీఎం సూచించారన్నారు. 14 వందల బస్సులు పూర్తిగా పడయ్యాయని... వాటి స్థానంలో కొత్త వాటిని కొనాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డినరీ బస్సులకు 25 పైసలు... ఇతర బస్సులకు 30 పైసలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. 

Advertisement
Advertisement