కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్

ABN , First Publish Date - 2021-09-02T00:04:35+05:30 IST

నగరంలోని జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ

కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ  వాకౌట్

హైదరాబాద్‌: నగరంలోని జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసింది. సమావేశంలో జలాల పంపిణీపై సయోధ్య కుదర లేదు. దీంతో సమావేశం నుంచి తెలంగాణ అధికారులు వాకౌట్ చేసారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50:50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని తెలంగాణ పట్టు పట్టింది. అయితే 70:30 పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం వాదించింది. ఎటూ తేలకపోవడంతో తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులు వాకౌట్‌ చేసారు.  సాగు , తాగు నీటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలంలో కరెంట్ ఉత్పత్తి చేయాలని కేఆర్‌ఎంబీ చైర్మన్ అన్నారు. 

Updated Date - 2021-09-02T00:04:35+05:30 IST