షాకిచ్చిన జియో, ఎయిర్‌టెల్, వీఐ

ABN , First Publish Date - 2021-08-04T02:38:39+05:30 IST

వినియోగదారులకు టెలికం కంపెనీలు మూకుమ్మడిగా షాకిచ్చాయి. ఇప్పటి వరకు ఖాతాదారులకు అందిస్తున్న

షాకిచ్చిన జియో, ఎయిర్‌టెల్, వీఐ

న్యూఢిల్లీ: వినియోగదారులకు టెలికం కంపెనీలు మూకుమ్మడిగా షాకిచ్చాయి. ఇప్పటి వరకు ఖాతాదారులకు అందిస్తున్న ఎస్సెమ్మెస్ ప్రయోజనాలను ఎత్తేస్తున్నాయి. ఇకపై ఇవి తక్కువ విలువ కలిగిన ప్రీపెయిడ్ ప్యాక్‌లపై అందుబాటులో ఉండవన్నమాట. మార్కెట్ దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీఐ (వొడాఫోన్ ఐడియా) సంస్థలు ఈ ప్రయోజనాలను మూకుమ్మడిగా ఎత్తేస్తున్నాయి. అంటే, ఇకపై ఎంట్రీ ప్లాన్లతో ఎస్సెమ్మెస్ ప్రయోజనాలు లభించవన్నమాట. లోవ్యాల్యూ ప్రీపెయిడ్ ప్యాక్‌లు రీచార్జ్ చేసుకునే వారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. 


2017లో జియో రూ.98 ప్లాన్‌ను తీసుకొచ్చినప్పుడు ఎస్సెమ్మెస్‌లు లభించేవి. ఆ తర్వాత రోజువారీ ఎస్సెమ్మెస్‌ల కోటాను 100 నుంచి 300కు పెంచింది. అయితే, ఆ తర్వాత ఆ ప్లాన్‌ను తొలగించింది. ఈ ఏడాది మేలో ఈ ప్లాన్‌ను తిరిగి తీసుకొచ్చినప్పటికీ అందులోంచి ఎస్సెమ్మెస్ ప్రయోజనాలను తీసేసింది. దీంతో ప్రత్యర్థి కంపెనీలైన ఎయిర్‌టెల్, వీఐ కూడా ఈ ఏడాది జూన్‌లో అదే పనిచేశాయి.


ప్రస్తుతం ఈ కంపెనీలు లో వ్యాల్యూ ప్యాక్‌లపై అపరమిత వాయిస్ కాలింగ్, హైస్పీడ్ డేటా కనెక్టివిటీని మాత్రమే అందిస్తున్నాయి. అంటే, ఖాతాదారులు కనుక ఎస్సెమ్మెస్‌లు పంపించాలనుకుంటే తప్పకుండా అత్యధిక విలువ కలిగిన ప్లాన్లను ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట.

Updated Date - 2021-08-04T02:38:39+05:30 IST