న్యూఢిల్లీ : బడ్జెట్లో లైసెన్స్ ఫీజులను తగ్గించాలని, స్పెక్ట్రం వాడకంపై జిఎస్టిని రద్దు చేయాలని, ఇన్పుట్ టాక్స్ క్రెడిట్‌ను తిరిగి చెల్లించాలని టెలికాం కంపెనీలు డిమాండ్ చేశాయి. వివరాలిలా ఉన్నాయి.
పన్ను భారం నేపధ్యంలో టెలికాం పరిశ్రమ రానున్న బడ్జెట్లో ఉపశమనాన్ని ఆశిస్తోంది. టెలికాం కంపెనీలు ప్రతీఏటా రూ. 58 వేల కోట్ల మేరకు పన్నులను చెల్లిస్తున్నాయి. ఈ క్రమంలో... తమపై భారాన్ని తగ్గిం చాలని ఆ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. లైసెన్స్ ఫీజును 8 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని టెలికాం కంపెనీలు కోరుతున్నాయి. ః
ఇక మూడు శాతం చొప్పున చెల్లిస్తోన్న స్పెక్ట్రం వినియోగ ఛార్జీని కూడా తగ్గించాలన్న డిమాండ్ ఉంది. ఇదికాకుండా, స్పెక్ట్రం ఆర్జన ఛార్జీపై ప్రత్యేక జీఎస్టీని తొలగించాలని డిమాండ్ వినిపిస్తోంది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్‌కు కంపెనీలు 5 శాతం మేరకు నిధులనందిస్తోన్న విషయం తెలిసిందే.
కాగా... కంపెనీలు రూ.35 వేల కోట్ల ఇన్పుట్ టాక్స్ రిటర్న్‌ను కోరు తున్నాయి. మరో వైపు, టెలికాం పరికరాలను తయా రు చేసే సంస్థలు... ప్రొడక్షన్ లింక్డ్ ప్రోత్సాహక పథ కాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.