Abn logo
Jan 23 2021 @ 00:17AM

‘టెలిగ్రామ్‌’లోనూ ‘లాస్ట్‌ సీన్‌’ దాచొచ్చు

వాట్సప్‌ కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిసిన మరుక్షణం నుంచే వినియోగదారులు అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్ల వైపు దృష్టిసారించారు. చాలాకాలం నుంచి వాట్సప్‌కు ఎంతోకొంత పోటీ ఇచ్చేస్థాయిలో  ‘టెలిగ్రామ్‌’ ఉంది. అయితే వాట్సప్‌ తాజా నిర్ణయంతో ‘టెలిగ్రామ్‌’ వైపు జంప్‌ అయ్యేవారి సంఖ్య పెరిగింది. ఇందులో కూడా వాట్సప్‌ తరహాలోనే కొన్ని ఫీచర్లు ఉన్నాయి. అందులో ‘లాస్‌ సీన్‌’ ఒకటి. టెలీగ్రామ్‌లో కూడా చివరిసారిగా సదరు వ్యక్తి ఆ యాప్‌ను ఎప్పుడు ఓపెన్‌ చేశాడో కనపడకుండా చేయవచ్చట. అది ఎలాగంటే....


మొదట తన స్మార్ట్‌ ఫోన్‌లో టెలిగ్రామ్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

స్ర్కీన్‌ టాప్‌లో ఎడమవైపు కార్నర్‌లో హామ్‌బర్గర్‌ను టాప్‌ ఆన్‌ చేయాలి.

మెనూలో సెట్టింగ్‌ ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని టాప్‌ ఆన్‌ చేయాలి.

తదుపరి ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీని ఆన్‌ చేయాలి.

ఇప్పుడు లాస్ట్‌ సీన్‌ను టాప్‌ ఆన్‌ చేయాలి. 

ఆఖర్లో చూసిన దాన్ని సెలెక్ట్‌ చేసుకోవాలి. డిఫాల్ట్‌ సెట్టింగ్‌ను మార్చాలి. కాంటాక్ట్‌లో ఎవరూ చూడకూడదని అనుకుంటే, ‘నోబడి’ ఆప్షన్‌ ఎంచుకోవాలి. 

స్ర్కీన్‌ కుడివైపు చెక్‌ మార్క్‌ను టాప్‌ చేయాలి. అప్పుడు స్ర్కీన్‌పై పాపప్‌ ప్రత్యక్షమవుతుంది. మీరు చివరిసారిగా ఆ యాప్‌ను ఎప్పుడు ఓపెన్‌ చేశారో హైడ్‌ చేస్తున్నట్లు మెసేజ్‌ చూపెడుతుంది. అంతే కాదు అందులోనూ రీసెంట్లీ, ఒక వారంలో, ఒక నెలలో అంటూ ఆప్షన్స్‌ ఉంటాయి. ఏది కావాలో టాప్‌ చేసేస్తే చాలు, యావత్తు ‘హైడింగ్‌’ ప్రక్రియ పూర్తవుతుంది.

Advertisement
Advertisement
Advertisement