Abn logo
Mar 3 2021 @ 04:40AM

కథలు చెబుతాను

ఇన్నాళ్లూ సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు అలియాభట్‌. ఇప్పుడు నిర్మాతగా మారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయబోతున్నారు. ఎటర్నల్‌ సన్‌షైన్‌ ప్రొడక్షన్స్‌ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ప్రకటించారు. ‘‘మీకు కథలు చెపుతాను. సంతోషపెట్టే, ఆహ్లాదకరమైన కథలు చెబుతాను’’ అని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూభాయ్‌ కతియావాడి’ చిత్రంలో అలియా నటిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement