ఫీవర్‌ సర్వే సిబ్బందికి వాస్తవాలు చెప్పండి

ABN , First Publish Date - 2021-06-24T07:08:40+05:30 IST

ఇంటింటికి ఫీవర్‌ సర్వే కోసం వచ్చే వైద్యసిబ్బందికి వాస్తవాలు చెప్పాలని అడిషినల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో రవిరాజు కోరారు.

ఫీవర్‌ సర్వే సిబ్బందికి వాస్తవాలు చెప్పండి
వేల్కూరులో కరపత్రాలను పంపిణీచేస్తున్న డాక్టర్‌ రవిరాజు

గంగాధరనెల్లూరు, జూన్‌ 23: ఇంటింటికి ఫీవర్‌ సర్వే కోసం వచ్చే వైద్యసిబ్బందికి వాస్తవాలు చెప్పాలని అడిషినల్‌ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రవిరాజు కోరారు. మండలంలోని వేల్కూరు కొత్తదళితవాడలో వైద్యసిబ్బంది ఫీవర్‌సర్వే చేస్తుండగా బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతివారం ఫీవర్‌సర్వే చేయడం వల్ల కరోనా నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించి, శానిటైజర్లు వినియోగించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీదేవి, ఈవోపీఆర్డీ శివయ్య, ఎంఎల్‌హెచ్‌వో ప్రసన్నలక్ష్మి,  మండల ఉపాధి హామీ ఏపీవో మృత్యుంజయరావ్‌, ఏఎన్‌ఎంలు రాజేశ్వరి, సుజాత, ఆశవర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T07:08:40+05:30 IST