సుధీర్‌బాబు, కృతీ శెట్టి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టైటిల్ ఖరారు చేశారు. నిర్మాతలు బి. మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి మాట్లాడుతూ ‘‘అద్భుత ప్రేమకథతో రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రమిది. సోమవారం హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభించాం’’ అని తెలిపారు. అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’ కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీత దర్శకుడు.