రెండు మెళుకువల వొకటి కావడాన్ని చెప్పడం

ABN , First Publish Date - 2020-08-24T06:25:01+05:30 IST

వుండనియ్యని రాత్రుల వెనుక పక్షి గూడు పగిలిన కలవరం తరువాత మధ్య రాత్రి అట్లా రోడ్డును తాకి వెళ్ళే...

రెండు మెళుకువల వొకటి కావడాన్ని చెప్పడం

వుండనియ్యని రాత్రుల వెనుక

పక్షి గూడు పగిలిన కలవరం తరువాత

మధ్య రాత్రి అట్లా రోడ్డును తాకి వెళ్ళే నీడల తోడు

నిద్ర చేరని కన్నుల చివర.


యిదంతా కాదు

ఔనూ, కాదు ముమ్మాటికి


వొక్కడి మెళుకువ.


గుప్పెటలో మూసెయ్యబడ్డ వూపిరిని

ఖాళీతనాన్ని వెక్కిరించే యింకో కన్నుల ప్రపంచాన్నీ

పొద్దున రాలిన పేరు మరిచిన పూవుల్నీ

మళ్ళీ యింకో మధ్యరాత్రి వానల్నీ


యిదంతా లేదు

ఔనూ, వుండదు మాటిమాటికీ.


మరొక్క మెళుకువ.

విజయ్‌ కుమార్‌ ఎస్వీకే

97033 35955

Updated Date - 2020-08-24T06:25:01+05:30 IST