అమరజీవి జీవితం స్ఫూర్తిదాయకం

ABN , First Publish Date - 2022-03-17T12:46:38+05:30 IST

ఆశయ సిద్ధి కోసం జీవితాన్నే త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తిప్రదాత అని పలువురు వక్తలు కొనియాడారు. చెన్నపురి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో మైలాపూర్‌లోని ఆంధ్ర మహిళా సభ ప్రాంగణంలో బుధవారం

అమరజీవి జీవితం స్ఫూర్తిదాయకం

                       - జయంతి సభలో వక్తలు


ప్యారీస్‌(చెన్నై): ఆశయ సిద్ధి కోసం జీవితాన్నే త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తిప్రదాత అని పలువురు వక్తలు కొనియాడారు. చెన్నపురి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో మైలాపూర్‌లోని ఆంధ్ర మహిళా సభ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం అమరజీవి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా చెన్నపురి తెలుగు అకాడమీ మేనేజింగ్‌ ట్రస్టీ డా.తూమాటి సంజీవరావు రచించిన ‘అమరజీవి ప్రశస్తి’ని ఆవిష్కరించిన ‘తూమాటి వరివశ్య’ అనే గ్రంథాన్ని సభకు పరిచయం చేశారు. ముందుగా అమర జీవి చిత్రపటానికి నివాళులర్పించారు. రాజధాని కళాశాల విశ్రాంత ఆచార్యుడు ఎల్బీ శంకరరావు సభకు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా నెల్లూరు వేద సంస్కృత కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌ డా.చింతలపాటి పూర్ణానందశాస్త్రి, విశిష్ట అతిథిగా చెన్నై ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్‌ ఎం.సమత, ప్రత్యేక అతిథిగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షుడు అజంతా డా.కె.శంకరరావు పాల్గొన్నారు. ఐఆర్‌ఎస్‌ అధికా రిణి సమత అమరజీవి ప్రశస్తి పుస్తకాన్ని, తూమాటి వరివశ్య పద్యకావ్యాన్ని చింతలపూడి పూర్ణానంద శాస్త్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమత మాట్లా డుతూ... తూమాటి సంజీవరావు సాహితీ సేవ గొప్పదని, అమరజీవి త్యాగాన్ని తెలుగువారు మరిచిపోకుండా గుర్తించు కొనేలా దృఢ సంకల్పంతో రెండు పుస్తకాలు ముద్రించడం, ఈ ఆవిష్కరణ సభలో పాల్గొనడం ఆనంద కరమన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు రాజధాని లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్య అతిథి పూర్ణానంద శాస్త్రి మాట్లాడుతూ... రెండు గ్రంథాలను ఆవిష్కరించడం ముదావహమన్నారు. అజంతా శంకర రావు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగానికి 70 సంవత్స రాలు అయిందని, 1952 డిసెంబరు నుంచి 1953 సంవత్సరం వరకు ప్రధానంగా అమరజీవి త్యాగాన్ని ప్రశంసిస్తూ వివిధ కవులు రాసిన పద్యాలను సేకరించి పుస్తకంగా ప్రచురించటం వల్ల భావితరాలకు ఆయన చరిత్ర తెలుసుకొనే అవకాశం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులను ఘనంగా సత్కరిం చారు. తూమాటి సంజీవరావు తన రెండు పుస్తకాల ముద్రణకు, అందులో ఉన్న అంశాలను సేకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వక్తగా తుమ్మపూడి కల్పన వ్యవహరించగా, ట్రస్టీ కార్యదర్శి తిరునగరి భాస్కర్‌ సహా తెలుగు ప్రముఖులు వై.రామకృష్ణ, గుడిమెల్ల మాధురి, తెలుగు భాషాభిమా నులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-17T12:46:38+05:30 IST