Abn logo
Mar 9 2021 @ 14:34PM

అందుకు రెడీ అంటున్న తెలుగమ్మాయి..?

ఈషా రెబ్బ పక్కా తెలుగమ్మాయి అన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే తెలంగాణ అమ్మాయిగా అందరికీ సుపరిచితురాలే. టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన అంతకముందు ఆతర్వాత అన్న సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమయింది. మొదటి సినిమాతో మంచి పేరే తెచ్చుకుంది. అతర్వాత కూడా ఈ దర్శకుడు తెరకెక్కించిన అమీ తుమీ అన్న సినిమా చేసింది. ఈ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. ఆతర్వాత ఏవో చిన్నా చితకా సినిమాలు సినిమాలు చేసింది. త్రివిక్రం దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన అరవింద సమేత సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేసింది. కానీ ఈ సినిమా ఈషా రెబ్బకి ఏమాత్రం ఉపయేగపడలేదు. దాంతో టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ అందుకోవాలంటే పద్దతైన పాత్రలు కాదు బోల్డ్ పాత్రల్లో నటించాల్సిందే అని డిసైడయింది. 

ఈ క్రమంలో బాలీవుడ్ మాదిరిగా టాలీవుడ్‌లో తెరకెక్కిన పిట్టకథలు అన్న వెబ్ సిరీస్‌లో నటించింది. కానీ ఈ వెబ్ సిరీస్ కూడా ఈషా రెబ్బాకి అంతగా క్రేజ్ తీసుకురాలేకపోయింది. అయినా కూడా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేస్తోంది ఈ తెలుగమ్మాయి. ఈ మధ్య ఈషా రెబ్బ హాట్ ఫొటోస్ చూస్తుంటే ఎవరూ తెలుగమ్మాయి అంటే నమ్మడం లేదట. నెటిజన్స్ కూడా అదే కామెంట్స్ చేస్తున్నారట. అయినా ఈషా రెబ్బా ఇవన్ని పట్టించుకోవడం లేదు. ఇకపై కూడా బోల్డ్ క్యారెక్టర్స్ చేసేందుకు రెడీగా ఉన్నానంటూ లేటెస్ట్ గ్లామర్ ఫొటోస్ తో చెప్పకనే చెబుతోంది. కాగా ఈషా రెబ్బ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ అవకాశాలకోసం బాగానే ట్రై చేస్తోంది. కానీ ఎందుకనో అమ్మడికి అక్కడ కూడా ఆశించినట్టుగా అవకాశాలు దక్కడం లేదు. మరొక వైపు ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కి వచ్చిన కృతిశెట్టి లాంటి యంగ్ హీరోయిన్స్ తాకిడి కూడా గట్టిగానే తగులుతోంది. రానున్న రోజుల్లో ఈషా రెబ్బాకి ఎంతవరకు అవకాశాలు వస్తాయో చూడాలి.

Advertisement
Advertisement
Advertisement