తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా అక్షరయజ్ఞం!

ABN , First Publish Date - 2022-01-22T00:10:59+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) ఆధ్వర్యంలో, ‘ప్రపంచ సాహిత్య వేదిక’ పేరిట ఏడాదిన్న పాటు సాగిన అక్షరయజ్ఞం సాహితీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా అక్షరయజ్ఞం!

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) ఆధ్వర్యంలో, ‘ప్రపంచ సాహిత్య వేదిక’ పేరిట ఏడాదిన్నర పాటు సాగిన అక్షరయజ్ఞం సాహితీ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 2020 మే 31న తానా ఆధ్వర్యంలో ప్రపంచ సాహిత్య వేదిక ఆవిర్భవించింది. తానా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పూర్వాధ్యక్షులు(2019 - 2021) జయశేఖర్ తాళ్లూరి నేతృత్వంలో, తానా పూర్వాధ్యక్షులు(2011 – 2013) డా. ప్రసాద్ తోటకూర సారథ్యంలో, శతశతక కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ సమన్వయంలో, ప్రజా కవి, వాగ్గేయకారుడు వంగపండు ప్రసాద రావు వారి బృందం నిర్వహణలో ‘జానపద కళా వైభవం’ అనే కార్యక్రమంతో ప్రపంచ సాహిత్య వేదిక ఆవిర్భవించింది. నాటి నుంచి డిసెంబర్ 31, 2021 వరకు 20 నెలవారీ కార్యక్రమాలు, 10 ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు భాషా సాహిత్యాలలోని వివిధ అంశాలు ఈ వేదికపై ప్రస్తావనకు వచ్చాయి.


మొత్తం 113 గంటల 50 నిమిషాల 35 సెకెన్ల పాటు సాగిన ఈ అక్షరయజ్ఞంలో ప్రపంచ నలుమూలల నుండి 537 మంది సాహితీవేత్తలు, రచయితలు, రచయిత్రులు, సినీ గీత రచయితలు, యువత, అవధానులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు పాల్గొనడం సాహితీ చరిత్రలో ఒక అపూర్వ అధ్యాయం. అప్రతిహతంగా సాగుతున్న ఈ సాహితీ వైభవంలో పాల్గొన్న వారందరికీ, ఆదరించి  అభిమానిస్తున్న తెలుగు భాషా ప్రేమికులకు, ప్రసార మాధ్యమాలకు, కార్యకర్తలకు తానా నాయకత్వ బృందం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ 30 కార్యక్రమాల మొత్తం వీడియో లింకులు అన్నింటిని కుదించి ఒక యూట్యూబ్ ప్లే లిస్ట్‌‌లో పొందుపరిచింది. ఈ లింక్ ద్వారా అన్ని కార్యక్రమాలను సాహిత్యాభిమానులు వీక్షించవచ్చు.

Updated Date - 2022-01-22T00:10:59+05:30 IST