టాంటెక్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2021-04-20T16:58:05+05:30 IST

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్).. ఏప్రిల్ 17న ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. పదుల సంఖ్యలో దాతలు పాల్గొని.. రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలు

టాంటెక్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్).. ఏప్రిల్ 17న ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించింది. పదుల సంఖ్యలో దాతలు పాల్గొని.. రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు లక్ష్మి అన్నపూర్ణ పాలేటి స్పందించారు. కార్యక్రమం విజయవంతం కావడంపట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి విరాళాలు ఇచ్చి ఆర్థిక సహాయం చేసిన సరిత, వేంకట్ ములుకుట్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఫుడ్ కూపన్స్‌తో తోడ్పాటు అందించిన ఏటూబీ అధినేత రమేష్‌కు ధన్యవాదాలు చెప్పారు. కార్యక్రమంలో వలంటీర్లు పని చేసిన విద్యార్థులు కీర్తి కొండ, గీతాంజలి కోడూరు తదితరులను అభినందించారు. కార్యక్రమాన్ని మార్గదర్శనం చేసిన ఛైర్ డా.పవన్ పామదుర్తి, కో చైర్ వెంకట్ ములుకుట్లతోపాటు కార్యవర్గ సభ్యులు ఉమా మహేష్ పాన్నపల్లి, శరత్‌ యెర్రం, కళ్యాణి తడిమేటి, నీరజా కుప్పాచి, చంద్ర పొట్టిపాటి, రఘునాథ్ కుమ్మేత తదితరులకు ధన్యవాదాలు తెలియజేశారు. 




Updated Date - 2021-04-20T16:58:05+05:30 IST