టాస్ వినూత్న ఆలోచన.. డిజిటల్ విధానంలో ఉగాది సంబరాలు!

ABN , First Publish Date - 2020-04-06T20:42:44+05:30 IST

బ్రిటన్‌లోని తెలుగు ప్రజలు తెలుగు నూతన సంవత్సర (ఉగాది) వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్కాట్లాండ్ తెలుగు సంఘం (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించిన

టాస్ వినూత్న ఆలోచన.. డిజిటల్ విధానంలో ఉగాది సంబరాలు!

లండన్: బ్రిటన్‌లోని తెలుగు ప్రజలు తెలుగు నూతన సంవత్సర (ఉగాది) వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. స్కాట్లాండ్ తెలుగు సంఘం (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో స్కాట్లాండ్‌ తెలుగు సంఘం ఈ సంవత్సరం వినూత్న రీతిలో ఉగాది వేడుకలను నిర్వహించింది. పండుగ స్ఫూర్తిని కొనసాగించేందుకు.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ రూపంలో ఉగాది సంబరాలు జరిపించింది. ఈసారి ఉగాది వేడుకలను డిజిటల్ విధానంలో నిర్వహించుకుందాం అంటూ టాస్ ఇచ్చిన పిలుపునకు వందలాది మంది ప్రవాసులు స్పందించారు. సంప్రదాయ నృత్యాలు, నాటకాలు, పాటలుపాడి.. వీడియోలను టాస్ కార్యవర్గానికి పంపారు. ప్రవాసులు పంపిన వీడియోలను ‘టాస్ ఫేస్‌బుక్ గ్రూప్’లో ప్రతి 30 నిమిషాలకు ఒకటిచొప్పున టాస్ కార్యవర్గ సభ్యులు పోస్ట్ చేశారు. తద్వారా.. ఆ రోజు మొత్తం పండగ వాతావరణాన్ని సృష్టించారు. అనంతరం స్కాట్లాండ్ తెలుగు సంఘం సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం 2022 వరకు కొనసాగనున్నట్లు టాస్ సభ్యులు వెల్లడించారు. 


కార్యవర్గ సభ్యుల వివరాలు

కెంబూరి మైథిలి - సభాపతి

చింపిరి శివ      - అధ్యక్షుడు

కూచడి ఉదయ్ కుమార్ - ప్రధానశాకల కార్యదర్శి

గడ్డం వెంకటేష్        - కోశాధికారి, ప్రామాణికతలశాఖ కార్యదర్శి

నూక నిరంజన్     - సాంస్కృతిక‌శాఖ కార్యదర్శి

దండూరి మాధవీలత - మహిళాశాఖ కర్యదర్శి

పర్రి విజయ్ కుమార్   - సమాచార సాంకేతిక మరియు ప్రజా సంబంధాలశాఖ కార్యదర్శి


Updated Date - 2020-04-06T20:42:44+05:30 IST