Advertisement
Advertisement
Abn logo
Advertisement

అస్సాంలో తెలుగు సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

అనంతపురం: జిల్లాలోని ఓ జవాన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గుంతకల్లు మండలంలోని పులగుట్టపల్లి పెద్ద తాండాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాను లక్ష్మి వెంకటేష్ నాయక్ (23) మృతి చెందాడు. అస్సాంలో విధి నిర్వహణలో ఉండగా తెల్లవారుజామున తుపాకీ మిస్ ఫైర్ కావడంతో జరిగిన ప్రమాదంలో వెంకటేష్ నాయక్ మృత్యువాత పడ్డాడు. రేపు ప్రత్యేక హెలికాప్టర్లో మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

Advertisement
Advertisement