తెలుగులో తొలి సివిల్‌ కేసు తీర్పు

ABN , First Publish Date - 2021-04-17T06:31:24+05:30 IST

ఆలమూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి హెచ్‌.అమరరంగేశ్వరావు శుక్రవారం ఓ తీర్పును ఆన్‌లైన్‌లో తెలుగులో ఇచ్చారు.

తెలుగులో తొలి సివిల్‌ కేసు తీర్పు

ఆలమూరు, ఏప్రిల్‌ 16: ఆలమూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి హెచ్‌.అమరరంగేశ్వరావు శుక్రవారం ఓ తీర్పును ఆన్‌లైన్‌లో తెలుగులో ఇచ్చారు. సివిల్‌ కేసులో రాష్ట్రంలో ఇదే మొదటిగా భావిస్తున్నారు. గతంలో ఈయన ఇదే కోర్టులో క్రిమినల్‌ కేసులో తెలుగులో తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. పామర్రు రహదారిని ఆనుకుని ఉన్న రెండు సెంట్ల స్థలంలో అక్రమంగా బస్‌ షెల్టర్‌, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ కపిలేశ్వరపురం మండలం టేకికి చెందిన సూరంపూడి వెం కటలక్ష్మి 2015లో అదే గ్రామానికి చెందిన గుత్తుల గంగరాజుతోపాటు మరో 16 మందిపై కోర్టులో దావా వేసింది. ఆక్రమణలను తొలగించాలని కోరింది. వారి వాదనలు, సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత వెంకటలక్ష్మి న్యాయస్థానంలో సరైన ఆధారాలు ప్రవేశపెట్టలేకపోవడంతో కేసును కొట్టివేశారు. అందరికీ అర్థమయ్యే లా తెలుగులో తీర్పు చెప్పడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-17T06:31:24+05:30 IST