Abn logo
Sep 26 2021 @ 00:12AM

తెలుగుభాష మధురమైనది

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నందమూరి లక్ష్మీపార్వతి

తెలుగుభాష బతకాలంటే తల్లిదండ్రుల బాధ్యత కీలకం

రాష్ట్ర తెలుగు, సంస్కృతి అకాడమి అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి

కడప వైవీయూ, సెప్టెంబరు 25: తెలుగుభాష మధురమైనదని రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమి అధ్యక్షురాలు డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ‘తెలుగుభాష అభివృద్ధి, అవకాశాలు, సవాళ్లపై భాషా చైతన్య సదస్సు’ను వైవీయూ ఆర్ట్స్‌ భవనంలోని సెమినార్‌ హాలులో శనివారం నిర్వహించారు. తెలుగుశాఖ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా విచ్చేసిన ఆమె జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. తెలుగుభాషపై సంస్కృత ప్రభావం ఎంతో ఉందని అన్నారు. తెలుగుభాషను బతికించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలు చేయడానికి ముందు సర్వే నిర్వహించామని 98 శాతం మంది ఆంగ్ల మాధ్యమానికి అనుకూలంగా సంతకాలు చేశారని తెలిపారు. తెలుగు ఒక సబ్జెక్టుగా కొనసాగుతోందని చెప్పారు. వీసీ సూర్యకళావతి, రిజిసా్ట్రర్‌ విజయరాఘవప్రసాద్‌, ప్రిన్సిపల్‌ చంద్రమతి శంకర్‌ తదితరులు ప్రసంగించారు. అనంతరం లక్ష్మీపార్వతి యూనివర్శిటీలోని బొటానికల్‌ గార్డెన్‌ను సందర్శించారు.