Abn logo
Apr 7 2020 @ 10:56AM

ఇటలీ నుంచి వచ్చి ఢిల్లీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు

అమరావతి: తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చి అక్కడ చిక్కుకుపోయారు. 14 రోజుల క్వారంటైన్ ముగిసినప్పటికీ లాక్‌డౌన్ నేపథ్యంలో స్వస్థలానికి వచ్చే దారి తెలియక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మార్చి 14న తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఇటలీ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీ నుంచి వచ్చిన వెంటనే ఐటీబీపీ శిబిరానికి సైన్యం తరలించింది. అక్కడ 14 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేసుకుని 30వ తేదీ నాటికి విద్యార్థులు బయటకు వచ్చారు.


వారందరికీ కరోనా నెగెటివ్ అని  ఫలితాలు రావడంతో ఆర్మీ వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ఆయా రాష్ట్రాల వారు తమ తమ రాష్ట్రాలకు తీసుకెళ్లారు. కానీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులను మాత్రం పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. తెలుగు రాష్ట్రాలలోని హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసినా స్పందన కనిపించడం లేదని విద్యార్థులు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే జోక్యం చేసుకోవాలని తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement