కూ(Koo) లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు టైటాన్స్

ABN , First Publish Date - 2021-10-23T01:09:24+05:30 IST

కూ(Koo) లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు టైటాన్స్

కూ(Koo) లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు టైటాన్స్

హైదరాబాద్: తెలుగు టైటాన్స్ ప్రో కబడ్డీ లీగ్ టీమ్ ఈ రోజు కూ(Koo) లో ప్రొఫైల్ క్రీయేట్ చేసినట్టు ప్రకటించింది. వారి మొదటి కూ(Koo) గా ఒక వీడియో పోస్ట్ చేస్తూ డిసెంబర్ 2021న కబడ్డీ సీజన్ స్టార్ట్ కాబోతుందని ప్రకటించారు.


తెలుగు టైటాన్స్ కూ(Koo) చేస్తూ, "ఆత్మ విశ్వాసం అనేది ఈ ఆటలోనే కాదు ఏ ఆటలో అయినా చాలా అవసరమని, మీరు చేయగలరని మీరు అనుకోకపోతే, మీరు చేయలేరని, మేం వచ్చేస్తున్నామని పేర్కొంది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ప్రారంభమవుతున్న కొత్త సీజన్ గురించి వీడియోలో వీక్షకులకు సందేశం ఉంది. తెలుగు టైటాన్స్ మొదటి కూ(Koo), తెలుగు టైటాన్స్ ఎంట్రీతో కబడ్డీ చర్చలకు కూ(Koo) ఒక వేదిక కానుంది. "కూతకుసిద్దం" అంటూ పోస్ట్ చేసి వాళ్లు సిద్ధంగా ఉన్నారని అభిమానులకు తెలిపారు.



Updated Date - 2021-10-23T01:09:24+05:30 IST