Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా వచ్చిందన్న అనుమానం.. లండన్ నుంచి వచ్చిన మహిళకు అవమానం

హైదరాబాద్: లండన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ మహిళకు నగరంలో చేదు అనుభవం ఎదురైంది. ఒమైక్రాన్ అనుమానంతో పోలీసులు, అధికారులు తనను వేధించినట్లు ఆమె తెలిపారు. కోవిడ్ లేకపోయినా.. తనకు కరోనా వచ్చిందంటూ హల్ చల్ చేశారని, ఎక్కడి నుంచి వచ్చానో మళ్లీ అక్కడికే వెళ్లాలంటూ బెదిరించారని చెప్పారు. గంటగంటకూ కోవిడ్ పరీక్ష ఫలితం మారిందని, చివరికి నెగెటివ్ వచ్చిందని ఆమె అన్నారు. అధికారులు తన కుటుంబానికి మనోవేధన మిగిల్చారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో చిన్నారి పాపతో నరకయాతన పడ్డానని ఆ మహిళ వాపోయారు. యంత్రాంగం తప్పులకు తాను, తన కుటుంబం తీవ్ర మనోవ్యథను ఎదుర్కొంటున్నట్లు ఆ మహిళ తెలిపారు.


విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణీకురాలితో అధికారులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కరోనా రాకపోయినా వచ్చిందంటూ ఆ ప్రయాణీకురాలికి అధికారులు నరకం చూపించారు. ముందు నెగిటివ్ అని చెప్పిన వాళ్లే.. మరో గంట తర్వాత పాజిటీవ్ అని చెప్పారని ఎలా వచ్చానో అలాగే వెళ్లిపోవాలని బెదించారని ఆ మహిళ ఏబీఎన్‌కు సెల్ఫీ వీడియో పంపించారు. చిన్న పాపతో స్వదేశం వచ్చిన తనను అధికారులు తీవ్రంగా అవమానించి కుటుంబానికి మనోవ్యధ మిగిల్చారని ఆమె వాపోయారు.

Advertisement
Advertisement