వేసవి ఆరంభంలోనే మండుతున్న ఎండలు

ABN , First Publish Date - 2021-02-27T13:17:07+05:30 IST

ఈ ఏడాది వేసవి ఆరంభ దశలోనే ఎండలు మండుతున్నాయి....

వేసవి ఆరంభంలోనే మండుతున్న ఎండలు

భువనేశ్వర్ (ఒడిశా): ఈ ఏడాది వేసవి ఆరంభ దశలోనే ఎండలు మండుతున్నాయి. ఒడిశాలోని భువనేశ్వర్ నగరంలో శుక్రవారం ఉష్ణోగ్రత 40.4 డిగ్రీల సెల్షియస్ కు పెరిగింది. అప్పుడే ఎండలు మండిపోతుండటంతో ఒడిశాలో ఒంటిపూట పాఠశాల తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 1వతేదీ నుంచి 9,10 వతరగతి విద్యార్థులకు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, 10నుంచి12 వతరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి ఒంటిగంట వరకు తరగతులు నిర్వహించాలని సర్కారు ఆదేశించింది. భువనేశ్వర్ నగరంలో 1963 ఫిబ్రవరి 23వతేదీన అత్యధిక ఉష్ణోగ్రత 42.7 డిగ్రీలుగా నమోదైంది. 


భువనేశ్వర్ నగరంలో రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రత 18 నుంచి 39 డిగ్రీల సెల్షియస్ ఉంటుందని ప్రాంతీయ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.వచ్చే నాలుగైదు రోజుల్లో ఒడిశాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు చెప్పారు. భువనేశ్వర్ తో పాట బాలాసోర్, కటక్, సంబాల్ పూర్, సుందరఘడ్, బారిపడద ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్షియస్ కు పైగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.ఒడిశాలో ఆరంభంలోనే సూరరశ్మి ప్రతాపం చూపిస్తుండటంతో ఒడిశా సహాయ పునరావాస కమిషనర్ జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు.

Updated Date - 2021-02-27T13:17:07+05:30 IST