ఆ ఆలయంలో తరచూ 20 అడుగుల ఎత్తున ఎగసిపడే అగ్నికీలలు... పరుగుపరుగున భక్తులు వచ్చి ఏం చేస్తారంటే.. నేటికీ అంతుచిక్కని రహస్యం

ABN , First Publish Date - 2021-10-10T15:38:02+05:30 IST

ఆ ఆలయంలో తరచూ 20 అడుగుల ఎత్తున ఎగసిపడే అగ్నికీలలు... పరుగుపరుగున భక్తులు వచ్చి ఏం చేస్తారంటే.. నేటికీ అంతుచిక్కని రహస్యం

ఆ ఆలయంలో తరచూ 20 అడుగుల ఎత్తున ఎగసిపడే అగ్నికీలలు... పరుగుపరుగున భక్తులు వచ్చి ఏం చేస్తారంటే.. నేటికీ అంతుచిక్కని రహస్యం

రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో గల అమ్మవారి ఆలయం అద్భుతాలకు నిలయంగా నిలిచింది. కురబ్-బాంబోరా రోడ్డు సమీపంలో ఉన్న ఈడాణా అమ్మవారి అలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆలయంలో కొలువైన అమ్మవారు నెలలో పలుమార్లు అగ్నిస్నానం చేస్తారు. ఈ సమయంలో ఆలయం అంతటా అగ్నికీలలు చుట్టుముడతాయి. 20 అడుగుల ఎత్తుకుపైగా మంటలు వ్యాపిస్తాయి ఇది కొన్ని దశాబ్ధాలుగా కొనసాగుతోంది. ఈ అగ్నికీలలను చూసి స్థానికంగా ఉన్నవారంతా ఆలయం దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు.


అమ్మవారి ఆలయం కొన్ని గంటల పాటు ఇలా మంటల్లోనే ఉంటుంది. ఈ సమయంలో భక్తులు వందలకొద్దీ చున్నీలను, దారాలను ఆ అగ్నికీలలకు అర్పిస్తారు. దీంతో మంటలు చల్లారుతాయి. ఈ సందర్భంగా ఆలయ ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ కమలేంద్ర సింగ్ బోమ్లా మాట్లాడుతూ ఈ ఆలయం పాండవుల కాలం నాటిదని, అమ్మవారు అగ్నిస్నానం చేసిన అనంతరం, అమ్మవారి విగ్రహానికి గంగాజలంతో అభిషేకం చేసి, అందంగా అలంకరిస్తామన్నారు. కాగా ఈ ఆలయం ఓపెన్‌గా ఉంటుంది. పైన కప్పు ఉండదు. సంతానం కోసం పరితపించే దంపతులు ఈ అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే పక్షవాత వ్యాధిగ్రస్తులు ఈ ఆలయాన్ని సందర్శించుకొని, ఆలయంలో నిద్రిస్తే తమ వ్యాధి నయమవుతుందని నమ్ముతారు. భక్తులు తమ కోర్కెలు నెరవేరిన తర్వాత అమ్మవారికి బంగారు లేదా చెక్కతో చేసిన ఉయ్యాలను సమర్పించుకుంటారు. మరికొందరు భక్తులు వెండి త్రిశూలాన్ని కూడా సమర్పించుకుంటారు. ఈ ఆలయం గురించి మెహన్‌లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయ రసాయనశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ సిద్ధార్థశర్మ మాట్లాడుతూ అగ్ని దానంతట అదే ప్రజ్వరిల్లడం వెనుక ఇగ్నిషన్ టెంపరేచర్(జ్వలన ఉష్ణోగ్రత) కారణమన్నారు. ఇలా వస్తువులు ఉన్నట్టుండి దహనమవడానికి ఇగ్నిషన్ టెంపరేచరే కారణమని తెలిపారు.

Updated Date - 2021-10-10T15:38:02+05:30 IST