టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధి

ABN , First Publish Date - 2021-03-05T06:42:06+05:30 IST

తె లంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వా త తమ ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నా మని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. గురువా రం జిల్లాకేంద్రంలోని గండి రామన్న నూతన శివాలయ దక్షిణముఖ ఆంజనే య సాయి నందదీప్‌ ఆలయ తృతీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయంలో అల్లోల దంపతులు పూజలు చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధి
పనులు ప్రారంభిస్తున్న మంత్రి అల్లోల

నిర్మల్‌, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తె లంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వా త తమ ప్రభుత్వ హయాంలో ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నా మని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అ ల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. గురువా రం జిల్లాకేంద్రంలోని గండి రామన్న నూతన శివాలయ దక్షిణముఖ ఆంజనే య సాయి నందదీప్‌ ఆలయ తృతీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయంలో అల్లోల దంపతులు పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆలయ ఆవరణలో ధాన్య మందిరం నిర్మాణానికి రూ.50 లక్షలు, ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని శ్రీ గండి రామన్న దత్తసాయి ఆలయం సింగిల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, సాయి దీక్ష సేవా సమితి ట్రస్ట్‌ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి మం త్రిని కోరారు. దీంతో స్పందించిన మంత్రి మంజూరు చేస్తామన్నారు. కార్యక్ర మంలో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి రాంకిషన్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, కూచాడి శ్రీహరి రావు, కొరిపెల్లి దేవేందర్‌ రెడ్డి, నర్సారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి, నందు, లింగారెడ్డి, జైపాల్‌ రెడ్డి, కృష్ణ, పండరి, లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మామడ: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అల్లోల అన్నారు. పరిమండల్‌లో రైతు వేదికను గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో స ర్పంచ్‌ నాగమణి, దశరథ్‌, ఎంపీపీ అమృత జైసింగ్‌, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు వెంకట్‌ రాంరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్మదా పాల్గొన్నారు. 

పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

నిర్మల్‌ టౌన్‌: అభివృద్ధి పనులను పూర్తి చేయాలని మంత్రి అల్లోల అన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరుపై జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఏప్రిల్‌ నాటికి ఇళ్ల పను లు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు పాలనాధికారి హే మంత్‌ బోర్క డే, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పట్టణాన్ని అభి వృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని మంత్రి అన్నారు. గురు వారం శివాజీ చౌ క్‌లో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-05T06:42:06+05:30 IST