ఆ మందిరంలో రోజూ రెండు పూటలా 2 వేల మందికి భోజనం

ABN , First Publish Date - 2020-09-07T14:26:40+05:30 IST

కేరళలోని కొట్టాయం జిల్లాలోని వైకామ్ మహాదేవ్ మందిరం దక్షిణ భారత దేశంలో ఎంతో ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది. ఈ మందిరంలో కొన్ని దశాబ్ధాలుగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఆలయంలోని...

ఆ మందిరంలో రోజూ రెండు పూటలా 2 వేల మందికి భోజనం

కొట్టాయం: కేరళలోని కొట్టాయం జిల్లాలోని వైకామ్ మహాదేవ్ మందిరం దక్షిణ భారత దేశంలో ఎంతో ప్రాచీన ఆలయంగా గుర్తింపు పొందింది. ఈ మందిరంలో కొన్ని దశాబ్ధాలుగా అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఆలయంలోని వంటగదిలో ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం రెండు వేల మంది భక్తుల కోసం భోజనం సిద్ధం చేస్తారు. ఏ సమయంలో వచ్చినా ఆలయంలో భక్తులకు భోజనం సిద్ధంగా ఉంటుంది.


లాక్‌డౌన్ సమయంలోనూ ఆలయం తరపున ఆహార వితరణ కార్యక్రమం కొనసాగింది. కేరళలోని కొన్ని ఆలయాల్లో మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో ఆహారాన్ని అందించే కార్యక్రమం జరుగుతుంటుంది. అలాంటివాటిలో తిరువనంతపురంలోని ప్రముఖ పద్మనాభస్వామి ఆలయం ఒకటి. కాగా 108 సంవత్సరాలుగా వైకామ్ మహాదేవ్ మందిరంలో నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ఉత్సవాల సమయంలో ఈ మందిరంలో 3,600 కిలోల బియ్యంతో అన్నం వండుతారు. ఈ భోజనశాలలో 16 నాయర్ కుటుంబాలకు చెందినవారు కొన్ని తరాలుగా సేవలు అందిస్తున్నారు.

Updated Date - 2020-09-07T14:26:40+05:30 IST