ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి : మంత్రి వనిత

ABN , First Publish Date - 2021-12-08T05:04:28+05:30 IST

ఆలయ కమిటీలు ఆలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి తానేటి వనిత అన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలి : మంత్రి వనిత
పూజలు చేస్తున్న మంత్రి వనిత

కొవ్వూరు, డిసెంబరు 7:  ఆలయ కమిటీలు ఆలయాల అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేయాలని మంత్రి తానేటి వనిత అన్నారు. గండిపోచమ్మ అమ్మవారి ఆలయ కమిటి చై ర్మన్‌ గంధం శ్రీనివాస్‌, సభ్యులు గడ్డే బాలకృష్ణ, అడబాల దేవి, పోలేటి కృష్ణ, గోరిజాల వరలక్ష్మి, ఈతకోటి సూర్యకుమారి, మారిశెట్టి వెంకటలక్ష్మితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయించారు. కుమారదేవం గ్రామ పరిధిలోని మూడు దేవాలయాలలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గండి పోచమ్మ ఆలయ కమిటీ ఛైర్మన్‌గా గంధం శ్రీనివాస్‌, వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా మద్దిపాటి ఉమాశ్రీదేవి, శివాలయం కమిటీ చైర్మన్‌గా మారిశెట్టి వెంకటేశ్వరరావును నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, సర్పంచ్‌ కాసాని దుర్గ, ఎంపీటీసీ ఎండవల్లి నటరాజారావు, నీటి సంఘం అధ్యక్షుడు బీ.శ్రీనివాసరావు, ఎంపీడీవో పి.జగదాంబ, ఆలయ ఈవో ఎం.నాగరాజు, డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సుజన్‌కుమార్‌, ఎ.దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:04:28+05:30 IST