శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు

ABN , First Publish Date - 2021-11-30T07:09:04+05:30 IST

కార్తీక సోమ వారం సందర్భంగా మేళ్లచెర్వులోని స్వయం భు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో శివలింగానికి చందనోదకంతో అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు.

శివనామ స్మరణతో మార్మోగిన ఆలయాలు
నేరేడుచర్ల శివాలయంలో అభిషేకం చేస్తున్న అర్చకుడు

మేళ్లచెర్వు, నవంబరు 29: కార్తీక సోమ వారం సందర్భంగా మేళ్లచెర్వులోని స్వయం భు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో శివలింగానికి చందనోదకంతో అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు.  అనంతరం రకరకాల పూలతో సుందరంగా అలంకరిం చారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు కొంక శివవిష్ణు వర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ ఆలయ సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.

ఆలయాల్లో కొనసాగిన భక్తుల రద్దీ

నేరేడుచర్ల:  నేరేడుచర్ల పట్టణ, మండల పరిధిలోని పలు శివాలయాల్లో భక్తుల రద్దీ కొనసాగింది. నేరేడుచర్ల శివాలయంలో ఉగ్రదండి శివప్రసాదశర్మ, సోమప్ప దేవాలయంలో ఇరువంటి శ్రీనివాసశాస్త్రి, దిర్శించర్ల శివాలయంలో ఫణికుమారశర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 

సూర్యాపేట కల్చరల్‌: జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో భక్తిశ్రద్ధ లతో పూజలు కొనసాగాయి శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో  జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక పాల్గొన్నారు. శ్రీసంతోషిమాత దేవాలయం, శ్రీఅన్నపూర్ణ సహిత విశ్వనాథస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ కొన సాగింది.  ఆలయాల్లో శివలింగాలకు అభిషేకాలు, అర్చన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు.  

హుజూర్‌నగర్‌:   కార్తీకమాసం సోమవారం సందర్భంగా మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలోని నల్లకట్ట సంతానకామేశ్వరీ సమేత శంభులింగేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారికి శాంతి కల్యాణం నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాతం, గణపతిపూజ, మహాన్యాసపూర్వక ఏకాదశరుద్రాభిషేకాలు, సహస్రనామార్చనలు, అలంకరణ చేశారు. కల్యాణం అనం తరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని రైల్వే బోర్డు సభ్యుడు యరగాని నాగన్న ప్రారంభించారు. ఈ కార్యక్ర మంలో ఆలయ కమిటీ చైర్మన్‌ చిమట చినసైదులు, పూజారి రవీంద్రాచార్యులు, సర్పంచ్‌ సలీమా, అలీపాషా, ఆదెమ్మ, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌, రాగం లింగయ్య, తీగల సురేష్‌, అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్‌ తదితరులు పాల్గొన్నారు. 

దుపహాడ్‌ గ్రామంలో కార్తీక వన భోజనాలు

పెన్‌పహాడ్‌: మండల పరిధిలోని దూపహాడ్‌ గ్రామంలో శ్రీరామాంజనేయ స్వామి భక్త భజన మండలి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు నిర్వ హించారు. గ్రామంలో ఆట, పాటలు, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో దంపతులు సామూహి కంగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్ర మంలో భక్తమండలి సభ్యురాలు కీత సరోజనమ్మ, విశ్వ హిందూ షరిషత్‌ సభ్యులు పాల్గొన్నారు.



 

Updated Date - 2021-11-30T07:09:04+05:30 IST