తెరుచుకున్న ఆలయాలు

ABN , First Publish Date - 2021-06-21T06:34:12+05:30 IST

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయాల్లో ఆదివారం నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిచ్చారు.

తెరుచుకున్న ఆలయాలు
ఆలయ ఆవరణలో కేశఖండనం పూజలు నిర్వహిస్తున్న భక్తులు

ధర్మపురిలో భక్తుల దర్శనాలకు అనుమతి

ధర్మపురి, జూన్‌ 20 : ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుబంధ ఆలయాల్లో ఆదివారం నుంచి భక్తుల దర్శనాలకు అనుమతిచ్చారు. ఆలయాల్లో అర్జిత సేవలు కూడా ప్రారంభం అయ్యాయి. కరోనా నేప థ్యంలో మే 12 నుంచి ఆలయాలను మూసి వేశారు. ఆలయం అర్జిత సేవలు రద్దు చేసి ప్రతి రోజు జరిగే నిత్య పూజలు, కార్యక్రమాలు అర్చకులు అంతర్గతంగా నిర్వహించారు. దీంతో 40 రోజుల నుంచి ఆల యంలో స్వామి వారి దర్శనానికి భక్తులు నోచుకోలేదు. ప్రభుత్వం లాక్‌ డౌన్‌ పూర్తి స్థాయిలో ఎత్తి వేయ డంతో భక్తులకు దర్శనం కోసం అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం ఆలయాలు తెరిచి అర్చకులు అభిషేకం, నిత్య పూజలు నిర్వహించారు. భక్తులు మాస్కులు ధ రించి, భౌతిక దూరం పాటించి స్వామి వారలను దర్శనం చేసుకున్నారు. ఆలయ వేదపండితులు బొజ్జ రమేష్‌శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.     

Updated Date - 2021-06-21T06:34:12+05:30 IST