Abn logo
Feb 24 2021 @ 23:14PM

ఓపెన్‌ స్కూల్‌లో తత్కాల్‌ అడ్మిషన్లు


పాతపట్నం: ఏపీ ఓపెన్‌ స్కూల్‌ విధానంలో టెన్త్‌, ఇంటర్మీడియట్‌లలో ప్రవేశానికి తత్కాల్‌ (స్పాట్‌) అడ్మిషన్లు చేపడుతున్నామని ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సీహెచ్‌ మణికుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా విద్యకు దూరమైన వారికి ఇది మంచి అవకాశమన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు, చదువును మధ్యలో ఆపిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అడ్మిషన్లు మూడురోజులపాటు జరుగుతాయని, ఈ విషయాన్ని గమనించాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.  

Advertisement
Advertisement
Advertisement