Abn logo
Sep 27 2021 @ 00:16AM

ఖాతాదారులకు పదిశాతం డివిడెండ్‌

ఖాతాదారుల సమావేశంలో మాట్లాడుతున్న టౌన్‌బ్యాంకు సీఈవో

మదనపల్లె కో-ఆపరేటివ్‌ టౌన్‌బ్యాంకు సీఈవో


మదనపల్లె, సెప్టెంబరు 26: మదనపల్లె కో-ఆపరేటివ్‌ టౌన్‌బ్యాంకులో సభ్యుల వాటా ధనంపై ఈ ఏడాది నుంచి పదిశాతం డివిడెండ్‌ చెల్లిస్తామని సీఈవో పీవీ ప్రసాద్‌ చెప్పారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఖాతాదారులకు ప్రత్యేక సాయం అందిస్తామన్నారు. బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ఆదివారం 98వ వార్షిక మహాజన సభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బ్యాంకు డిపాజిట్లు రూ.75కోట్ల నుంచి రూ.81కోట్లకు పెరిగాయన్నారు. ఇక  అప్పులు కూడా రూ.53.82 కోట్ల నుంచి రూ.58.33కోట్లకు చేరిందన్నారు. అలాగే బ్యాంకు వ్యాపార ధనం రూ.90.35 కోట్ల నుంచి రూ.97.60 కోట్లకు పెరిగిందన్నారు. అనంతరం ఆయన బ్యాంకు వార్షిక నివేదికను ఖాతాదారుల ముందుంచారు.  సమావేశ పర్యవేక్షణ అధికారి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రిజర్వుబ్యాంకు  నిబంధనల ప్రకారం నడుస్తున్న టౌన్‌బ్యాంకులో  కార్పొరేట్‌ బ్యాంకులకు దీటుగా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఖాతాదారులు, ఏ తరగతి సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో బ్యాంకు మేనేజర్లు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.