Advertisement
Advertisement
Abn logo
Advertisement

చిన్నవయసులోనే వ్యాపారం... కోటీశ్వరురాలైన చిన్నారి..!

సిడ్నీ : ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఆస్ట్రేలియా నివాసి పిక్సీ కర్టిస్ అతి పిన్న వయసులోనే సంపన్నురాలుగా అవతరించింది. పిక్సీస్ ఫిడ్జెట్స్ ఆఫ్ మిలియనీర్ పిక్సీ అనే కంపెనీ కూడా నిర్వహిస్తోంది. దీంతో ఆమెకు కోట్లలో ఆదాయం వస్తోంది. ఆమె తల్లి రాక్సీ కూడా తనకు సాయపడుతోంది. ఆమె కూడా విజయవంతమైన పబ్లిక్ రిలేషన్స్ గురు రాక్సీ మేనేజర్ కావడం విశేషం. సొంతంగా వ్యాపారం చేయాలన్న తన అలోచనకు తల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుమార్తె కోరిక నేపధ్యంలో... తల్లీకూతుళ్ళిద్దరూ కలిసి ఈ ఏడాది మే నెలలో  వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందుకోసం చాలా బొమ్మలను సేకరించి, విక్రయించడం ప్రారంభించారు. అలా తొలిసారిగా... అన్ని బొమ్మలూ కేవలం రెండు రోజుల్లోనే అమ్ముడుపోయాయి. 


అదే స్ఫూర్తితో... ‘పిక్సీస్ బోస్’ బ్రాండ్ పేరుతో హెయిర్ యాక్సెసరీ బ్రాండ్‌ను కూడా సృష్టించి, తమకంటూ ఓ సరికొత్త ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తల్లీకూతుళ్ల బొమ్మలు, బట్టలు, ఉపకరణాలు దీని ద్వారా విక్రయిస్తున్నారు. వీటన్నింటికీ... కేవలం పది సంవత్సరాల వయస్సు మాత్రమే ఉన్న పిక్సీ యాజమానిగా ఉండటం విశేషం. పిక్సీ తల్లి రాక్సీ కూడా విజయవంతమైన పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌గా వ్యవహరిస్తూ... పిల్లలకు ఖరీదైన బహుమతులు, బట్టలకు సంబంధించిన సలహాలు, సూచనలనిస్తూ పిక్సీ వ్యాపారానికి సాయమందిస్తోంది. ‘వ్యాపారం చేయాలనే కోరిక పక్సీలో చిన్నప్పుడే ఉండేది. నా సహకారంతో విజయం సాధించింది’ అని తల్లి పేర్కొంది. రాక్సీ స్వయంగా ‘స్వెటీ బెట్టీ పీఆర్’ పేరుతో ఓ వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఆమె భర్త కూడా ఆమెకు సహకరిస్తున్నారు. 

Advertisement
Advertisement