అత్యాచారం కేసులో పదేళ్ల కఠిన కారాగార శిక్ష

ABN , First Publish Date - 2021-06-23T07:33:05+05:30 IST

హత్య కేసులో నిందితుడికి పదేళ్ల కఠినకారాగార శిక్ష పడింది. జైలుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.

అత్యాచారం కేసులో పదేళ్ల కఠిన కారాగార శిక్ష

రూ.లక్ష జరిమానా ఫనల్లగొండ మహిళా కోర్టు తీర్పు

సూర్యాపేటరూరల్‌, జూన్‌ 22: హత్య కేసులో నిందితుడికి పదేళ్ల కఠినకారాగార శిక్ష పడింది. జైలుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని ఓ తండాకు చెందిన మహిళను అదే తండాకు చెందిన లునావత్‌ రత్తిరామ్‌ 2014 సెప్టెంబరు 30న అత్యాచారం చేశాడు. ఆమె ఫిర్యాదుతో సూర్యాపేట రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.  అప్పటి రూరల్‌ సీఐ నర్సింహారెడ్డి ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు చేసి నిందితుడిపై  376, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా లోతైన విచారణ చేసి లునావత్‌ రత్తిరామ్‌ను పోలీసులు అరెస్టుచేశారు. పోలీసులు తండాలో పర్యటించి బాధితుల, సాక్షుల వాంగ్మూలం నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖాలు చేశారు. 15 మంది సాక్షులను, బాధితులను నల్లగొండ మహిళా కోర్టు జడ్జి శారదాదేవి విచారించారు.  నిందితుడు లునావత్‌ రత్తిరామ్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని నిర్ధారించి ఆయన్ను నేరస్థుడిగా పేర్కొంటూ  తీర్పునిచ్చారు. నిందితుడికి పదేళ్ల కఠిన కారాగారశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. బాధితురాలి తరుపున కేసును పీపీ జమీల్‌ వాదించారు. 


Updated Date - 2021-06-23T07:33:05+05:30 IST