నేత్ర పర్వం.. దీపోత్సవం

ABN , First Publish Date - 2020-12-01T05:48:38+05:30 IST

వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి కార్తీకమాస కోటి దీపోత్సవం కాంతులీనింది.

నేత్ర పర్వం.. దీపోత్సవం
దీపోత్సవంలో పాల్గొన్న మహిళలు, జ్యోతి ప్రకాశనం చేస్తున్న స్వాత్మానందేంద్రస్మామి, పక్కన ఎమ్మెల్యే శివకుమార్‌

 తెనాలి టౌన్‌, నవంబర్‌ 30: వైకుంఠపురంలోని శ్రీలక్ష్మీ పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి కార్తీకమాస కోటి దీపోత్సవం కాంతులీనింది. వందలాదిగా విచ్చేసిన భక్తులు హరహర నామ స్మరణతో తరించారు. విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతీస్వామి కార్తీక దీపోత్సవం సందర్బంగా అనుగ్రహ భాషణ చేశారు. వేంకటేశ్వరుని అనుగ్రహంతో కార్తీక మాసం పౌర్ణమి రోజున భగవంతుని అపార కరుణ భక్తులకు అందుతుందన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి శారదాపీఠం స్వామి ఆశీస్సులే కారణమన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ వుప్పల వరదరాజులు, ఈవో శ్రీనివాసరెడ్డి, యలవర్తి గీతాదేవి, వేదాంతం రాజగోపాల చక్రవర్తి, నోరి కోదండరాములు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:48:38+05:30 IST