రాజ్యాంగ హక్కులకు విఘాతం

ABN , First Publish Date - 2021-01-27T06:00:14+05:30 IST

రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం జగన్‌ ప్రభుత్వం కాలరాస్తుందని టీడీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ తెనాలి శ్రావణ్‌ కుమార్‌ విమర్శించారు.

రాజ్యాంగ హక్కులకు విఘాతం
పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న జిల్లా టీడీపీ నేతలు

తెనాలి శ్రావణ్‌ కుమార్‌

గుంటూరు, జనవరి 26(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను సైతం జగన్‌ ప్రభుత్వం కాలరాస్తుందని టీడీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ తెనాలి శ్రావణ్‌ కుమార్‌ విమర్శించారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారంమహ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్రలతో కలిసి జాతీయ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  పోలీసుల ద్వారా పాలన చేయటం, పరిపాలకులే ప్రజలను ఇబ్బంది పెట్టటం చూస్తుంటే డాక్టర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం అమలు అవుతుందా అనే అనుమానం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో నేతలు మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, కంచర్ల శివరామయ్య, అన్నాబత్తిని జయలక్ష్మి, కూచిపూడి విజయ, రిజ్వానా, కసుకుర్తి హనుమంతరావు, నాయుడు ఓంకార్‌, కొల్లి అనిల్‌, దామచర్ల శ్రీనివాసరావు, బొల్లెదు సుశీలరావు, ముత్తినేని రాజేష్‌ కొమ్మినేని కోటేశ్వరరావు, తాడివాక సుబ్బారావు, గుడిమెట్ల దయారత్నం, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-27T06:00:14+05:30 IST