ఇంటినిర్మాణం తొలగింపులో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2021-10-15T05:46:24+05:30 IST

స్థానిక శ్రీనివాస కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మిస్తున్నారని అదే కాలనీకి చెందిన లక్కవరపుకోట గో విందరావు హైకోర్టులో కేసువేశారు.

ఇంటినిర్మాణం తొలగింపులో ఉద్రిక్తత

శృంగవరపుకోట రూరల్‌: స్థానిక శ్రీనివాస కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు నిర్మిస్తున్నారని అదే కాలనీకి చెందిన లక్కవరపుకోట గో విందరావు హైకోర్టులో కేసువేశారు. దీంతో తదుపరి నిర్మాణం పై పంచా యతీకి ఉత్తర్వులు రావడంతో ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణం కూల్చేందుకు పోలీసులు, రెవెన్యూ, సచివాలయం సిబ్బం దితో గురువారం ఉదయం 10 గంటలకు వెళ్లారు. ఈ క్రమంలో ఇంటి నిర్మాణ దారులు, వారి మద్దతుదారులు దీనిని తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ నిర్మా ణం కూలగొడితే తాము ఆత్మహత్య చేసుకుంటామని పదుల సంఖ్యలో మ హిళలు ఆందోళన చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంత రం బాధితులు కొంత సమయం కోరడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ విషయంపై పంచాయతీ ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ అంది శైలజ స్థానికంగా జి-ప్లస్‌ 3 ఇంటి నిర్మాణాన్ని పంచాయతీ నిబంధనలకు విరు ద్ధ్దంగా చేపట్టారని, ఈ విషయంపై గోవిందరావు హైకోర్టును ఆశ్రయించ డంతో నిర్మాణం నిలిపివేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. అయినా సద రు వ్యక్తి నిర్మాణంకొనసాగించడంతో వాటినితొలగించేందుకు వెళ్లామన్నారు. 

Updated Date - 2021-10-15T05:46:24+05:30 IST