Abn logo
Oct 30 2020 @ 16:43PM

అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం మర్రిమేకులపల్లిలో ఉద్రిక్తత

అనంతపురం: తాడిమర్రి మండలం మర్రిమేకులపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామంలో పరిహారం చెల్లించకుండానే అధికారులు ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండగానే జేసీబీతో అధికారులు కూల్చారు. భయంతో ఇంట్లో నుంచి కుటుంబ సభ్యులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. అధికారుల తీరుపై గ్రామస్తులు మండపడుతున్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను ఖాళీ చేయమని చెబుతున్నారు. ప్రభుత్వానికి వ్యతరేకంగా నిర్వాసితులు నినాదాలు చేశారు. 

Advertisement
Advertisement