టెన్షన్‌ టెన్షన్‌

ABN , First Publish Date - 2021-11-16T07:17:46+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నల్లగొండ జిల్లా పర్యటన సోమవారం ఆద్యంతం ఉద్రిక్తతల నడు మ కొనసాగింది. ప్రతీచోట టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంజయ్‌ రాకను అడ్డుకున్నారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశా రు. కొన్నిచోట్ల బీజేపీ శ్రేణులు ప్రతిఘటించారు.

టెన్షన్‌ టెన్షన్‌
నేరేడుచర్లలో బండి సంజయ్‌ వాహనాన్ని అడ్డుకుంటున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిలువరిస్తున్న పోలీసులు

బండి యాత్రకు అడ్డు తగిలిన టీఆర్‌ఎస్‌

ఆరు కి.మీ. మేర అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

అడుగడుగునా దాడులు 8 బండి కాన్వాయ్‌పై రాళ్ల దాడి

ఎస్పీ పర్యవేక్షణ చేసినా అడ్డుకోలేక పోయిన పోలీసులు


(నల్లగొండ/ తిప్పర్తి / మాడ్గులపల్లి / వేములపల్లి / మిర్యాలగూడ / మిర్యాలగూడ అర్బన్‌ / నేరేడుచర్ల / గరిడేపల్లి రూరల్‌ / పెన్‌పహాడ్‌ / సూర్యాపేట రూరల్‌): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నల్లగొండ జిల్లా పర్యటన సోమవారం ఆద్యంతం ఉద్రిక్తతల నడు మ కొనసాగింది. ప్రతీచోట టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంజయ్‌ రాకను అడ్డుకున్నారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశా రు. కొన్నిచోట్ల బీజేపీ శ్రేణులు ప్రతిఘటించారు. చాలా చోట్ల భారీగా మోహరించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు విచ్చలవిడి దాడులకు దిగడంతో పోలీసులు దగ్గరుండి సంజయ్‌ కాన్వాయ్‌ను ముందుకుసాగేలా చేశారు. పది గంటల పాటు జరిగిన పర్యటన ఎక్కడా కూడా ప్రశాంతంగా సాగలేదు. చివరగా సూర్యాపేట మం డలం తాళ్ల ఖమ్మంపహాడ్‌లో గంటసేపు కారు లో సంజయ్‌ ఉండి పోవాల్సి వచ్చింది. పద కొండు గంటల ప్రాంతంలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ దగ్గరుండి సంజయ్‌ను జానారెడ్డినగర్‌ మీదుగా పేట వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. 



నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఆర్జాలబావికి 12.30 గంటలకు బండి సంజయ్‌ చేరుకున్నారు. అప్పటికే అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ నేతలు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. రైతులతో మాట్లాడుతున్న సంజయ్‌పై కోడిగుడ్లను విసిరారు. బీజేపీ కార్యకర్తలు ప్రతిదాడికి ప్రయత్నించారు. పోలీసులు చెదరగొట్టారు. గంటన్నర సేపు ఉద్రిక్తత నెలకొంది. 400 మంది మోహరించి, పరిస్థితిని పోలీసులు అదుపులోకి తెచ్చారు. దాడికి నిరసనగా బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. 


తిప్పర్తి / మాడ్గులపల్లిల్లో

తిప్పర్తిలోని మార్కెట్‌యార్డులో రైతులతో సంజయ్‌ ముచ్చటించారు. రైతులు ధైర్యంగా వరి సాగు చేసుకోవచ్చని సూచించారు. అదేవిధంగా మాడ్గులపల్లి మండలం కుక్కడంలోని పీఏసీఎస్‌ కేంద్రాన్ని సందర్శించారు. 


సంజయ్‌ వాహనంపై మొదటి దాడి.. 

వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద ఉన్న మిల్లుపాయింట్‌ వద్దకు 3 గంటల ప్రాంతంలో బండి సంజయ్‌ చేరుకున్నారు. అక్కడి రైతులతో మాట్లాడారు. మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆయనకు రశీదు చూపించారు. అనంతరం వెళ్లి కారులో కూర్చోకోగానే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కోడిగుడ్లతో సంజయ్‌ కాన్వాయ్‌పై దాడి చేశారు. ప్రతిగా బీజేపీ శ్రేణులు దాడులకు దిగారు. ఆయన వెళ్లాక బీజేపీ కార్యకర్తలు రాస్తారోకో చేయడం తో భారీగా ట్రాఫిక్‌ నిలిచింది. ధర్నాలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు పాదూరి కరుణ, జిల్లా, డివిజన్‌ నాయకులు సాధినేని శ్రీనివా్‌సరావు, దొండపాటి వెంకట్‌రెడ్డి, చిలుకూరి శ్యామ్‌, చల్లమల్ల సీతారాంరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. అక్కడి నుంచి బయలుదేరిన సంజయ్‌ మిర్యాలగూడలో భోజనం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించాల్సి ఉండగా రద్దు చేసుకుని సూర్యాపేట జిల్లాకు బయలుదేరారు. 


గడ్డిపల్లి గ్రామంలో..

రాత్రి 7 గంటలకు గడ్డిపల్లికి చేరుకున్న బండి సంజయ్‌ కాన్వాయ్‌ని టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. గ్రామం లో బీజేపీ జాతీయ మాజీ కౌన్సిల్‌ సభ్యుడు రామినేని ప్రభాకర్‌ విగ్రహానికి బండి సంజయ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంజయ్‌ కాన్వాయ్‌ని టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుని కోడిగుడ్లు, టమాటాలను విసిరారు. ఓ కార్యకర్త విసిరిన రాయి పోలీస్‌ వాహనాలపై పడటంతో కోదాడ పట్టణానికి చెందిన పోలీస్‌ వాహనం అద్దాలు పగిలాయి. 


రూటుమార్చినా అదే పరిస్థితి..

ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్‌ దాడులకు దిగుతుండటంతో పెన్‌పహాడ్‌ మండలం జానారెడ్డినగర్‌కు వెళ్లాల్సిన సంజయ్‌ కాన్వాయ్‌ను రూటు మార్చారు. అనంతారం స్టేజీ నుంచి అనాజీపురం మీదుగా సూర్యాపేట మండలం తాళ్లఖ్మంపహడ్‌ గ్రామానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు పెద్దసంఖ్యలో కాన్వాయ్‌ను అడ్డుకొని రాళ్లు రువ్వారు. దీంతో సంజయ్‌ గంటసేపు కారులోనే ఉండిపోయారు. అనంతరం బందోబస్తు నడుమ కేసారం నుంచి దాసాయిగూడెం మీదుగా ఇమాంపేటకు చేరుకున్నారు. అక్కడా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకోగా నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. అనంతరం అక్కడి నుంచి జానారెడ్డినగర్‌కు కాన్యాయ్‌ను మళ్లించారు. అక్కడ విలేకరులతో మాట్లాడిన పోలీసు భద్రత మధ్య సూర్యాపేటకు వెళ్లారు.


 కరెంట్‌ తీసి..రాళ్లు వేసి..

పెన్‌పహాడ్‌ మండలానికి సంజయ్‌ కాన్వాయ్‌ చేరుకునే సరికి రాత్రి 8గంటలు అయ్యింది. ఆయన పర్యటిస్తున్న ప్రతి గ్రామంలోనూ విద్యుత్‌ సరఫరా తీసివేయడంతో పాటు కాన్వాయ్‌ ను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు. దూపహాడ్‌, మాచారం, పెన్‌పహాడ్‌, అనంతారం, అనాజీపురం గ్రామా ల్లో పర్యటించినా చీకట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను చూడలేని పరిస్థి తి నెలకొంది. అనాజీపురం గ్రామంలో బండి సంజయ్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది.ఎస్పీ కలుగజేసుకుని వెంటనే సిబ్బందితో  అల్లరి మూకలను చెదరగొట్టారు. 


ఆరు కిలోమీటర్లు.. అడుగడుగునా

సూర్యాపేట-నల్లగొండ జిల్లా సరిహద్దులోని నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వంతెన వద్ద సంజయ్‌రాకను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు రాస్తారోకో చేశారు. నాలుగు గంటల సమయానికి ఒక్కసారిగా పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు చేరుకున్నాయి. ఆందోళన చేస్తున్న వారిని అక్కడి నుంచి తరలించారు. 5.47 గంటలకు సంజయ్‌ కాన్వాయ్‌ వంతెన వద్దకు చేరుకుంది. ఒక్కసారిగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుతగిలి రాళ్ల దాడి చేశారు. టీఆర్‌ఎస్‌ రాళ్ల దాడిలో రహదారి వెంట వెళ్తున్న పలు ప్రైవేటువాహనాలు కూడా దెబ్బతిన్నాయి. కోదాడ రూరల్‌ ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డికి స్వల్పగాయమైంది. ఆ తర్వాత చిల్లేపల్లి చెర్వుఅలుగు వద్ద మళ్లీ దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు వాహనాలు నిలిపి వాగ్వాదానికి దిగడంతో పోలీసులు పంపించారు. సుమారు ఆరు కిలోమీటర్ల మేర పోలీసులు బండి కాన్వాయ్‌కు రక్షణ కలిపించినా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నిలువరించలేకపోయారు. నేరేడుచర్లలో నూ కాన్వాయ్‌కి అడ్డంగా అర్ధనగ్నంగా రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.అయినా కార్లపై దాడులు చేశారు. బండి సంజయ్‌ వాహనం 6.30 గంటలకు నేరేడుచర్ల దాటి వెళ్లిపోయింది.  


ఏబీఎన్‌ -ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌కు గాయాలు

బండి సంజయ్‌ పర్యటనను కవర్‌ చేసేందుకు వెళ్లిన ఏబీఎన్‌ -ఆంధ్ర జ్యో తి రిపోర్టర్‌ మనోజ్‌ బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిలో గాయపడ్డారు. కంటి పై రాయి తగలడంతో బలమైన గాయ మైంది. ఆయనతో పాటు వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త మోదుగు సైదిరెడ్డి తలకు గాయంకావడం తో సొమ్మసిల్లి పడిపోయాడు. అదేవిధంగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలుకావటంతో పోలీసులు తమ వాహనంలో మిర్యాలగూడకు తరలించి చికిత్స చేయించారు. 


రైతుల కోసం ఎన్నిదాడులైనా భరిస్తా :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

నల్లగొండ/ మిర్యాలగూడ: రైతుల కోసం రాళ్లు, కోడిగుడ్ల దాడులు ఎన్నయినా భరిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్‌ అన్నారు. వరి వేస్తే ఉరే అన్నది సీఎం కేసీఆరే అని అన్నారు. జిల్లాకేంద్రం సమీపం లోని ఆర్జాలబావి, వేములపల్లి సమీపంలోని శెట్టిపాలెం వద్ద మిల్లుపాయింట్లను  సోమవారం సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో సాదకబాధలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఒకసారి వరి వద్దని, ఇంకోసారి మక్కలు వద్దని రైతులను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం కేసీఆర్‌ తన గజిని వేషాలు మానుకోవాలని అన్నారు. తన పర్యటనపై పోలీసులకు ముందుగానే సమాచారమిచ్చినా శాంతిభద్రతలు కాపాడటంతో పోలీసుయంత్రాంగం విఫలమైందన్నారు. రైతుల దృష్టి మళ్లించడానికి టీఆర్‌ఎస్‌ నాయకులతో రైతుల వేశంలో ఆందోళన చేయిస్తున్నారని విమర్శించారు. కార్య కమంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీఽఽధర్‌రెడ్డి, రాష్ట్ర, నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, ప్రేమ్‌చందర్‌రెడ్డి, మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌, గొంగిడి మనోహర్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్‌, బండారు ప్రసాద్‌, పాదూరి కరుణ పాల్గొన్నారు.


చిచ్చు పెట్టేందుకు బీజేపీ కుట్ర : మంత్రి జగదీ్‌షరెడ్డి

నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రశాంత వాతావరణం లో చిచ్చుపెట్టేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుట్రలకు తెరలేపారని మంత్రి జగ దీష్‌రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్‌ పర్యటన నేపథ్యంలో ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభు త్వంతో బండి సంజయ్‌ ఒప్పించగలరా అని మంత్రి ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో ఆరు సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు ప్రశ్నాంతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. అటువంటి ప్రశాంతత నెలకొన్న ప్రస్తుత పరిస్థితు ల్లో చిచ్చుపెట్టేందుకు బండి సంజయ్‌ కుట్రలకు తెర లేపారని ఆరోపించా రు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సందర్శన పేరిట రైతులపై బీజేపీ నాయకు లు దాడులు చేశారని ఆరోపించారు. బీజేపీ కుట్రలను అర్థం చేసుకున్న రైతులు బండి సంజయ్‌ని నిలదీశారని పేర్కొన్నారు. వందలాది కార్లల్లో అనుచరులను వెంట వేసుకొని జిల్లాల్లో పర్యటించిన బండి సంజయ్‌ ప్రశ్నించిన రైతులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. 


జనాలను రెచ్చగొడితే సహించం  : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి 

నల్లగొండ: యాసంగిలో పండించి న ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగో లు చేస్తుం దా లేదా అనే దానిపై బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నల్లగొండ జిల్లాకేంద్రం ఆర్జాలబావిలోని ధాన్యం కొనుగో లు కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తుంటే బీజేపీ ఆయ  కులు కావాలనే రైతులు, ప్రజలను రెచ్చగొడుతున్నారని, రెచ్చగొట్టే కార్యక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బండి సంజయ్‌పై ప్రజలు తిరగబడ టం ఖాయమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ఆలకుంట్ల నాగరత్నంరాజు, అబ్బగోని రమేష్‌, బొర్ర సుధాకర్‌, పిల్లి రామరాజు, సుంకరి మల్లేశ్‌గౌడ్‌, బోయపల్లి కృష్ణారెడ్డి, జనార్థన్‌రావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-16T07:17:46+05:30 IST