టెన్త్‌ మార్కుల గడువు జూన్‌ 30

ABN , First Publish Date - 2021-05-19T07:52:20+05:30 IST

పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలు మార్కులు కేటాయించి, ఆ మార్కుల జాబితాను బోర్డుకు సమర్పించేందుకు గడువును జూన్‌ 30 వరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) పొడిగించింది

టెన్త్‌ మార్కుల గడువు జూన్‌ 30

సీబీఎ్‌సఈ


న్యూఢిల్లీ, మే 18: పదో తరగతి విద్యార్థులకు పాఠశాలలు మార్కులు కేటాయించి, ఆ మార్కుల జాబితాను బోర్డుకు సమర్పించేందుకు గడువును జూన్‌ 30 వరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) పొడిగించింది. వాస్తవానికి జూన్‌ 11 లోపే మార్కులను కేటాయించి, అదే నెల 20లోపు ఫలితాలను వెల్లడిస్తామని సీబీఎ్‌సఈ ఇంతకుముందు ప్రకటించింది. అయితే కరోనా రెండో దశ కారణంగా వివిధ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో గడువును పెంచామని సీబీఎ్‌సఈ పరీక్షల కంట్రోలర్‌ సనయ్‌ భరద్వాజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో టీచర్లు, అనుబంధ పాఠశాలల సిబ్బంది భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. కాగా, పదో తరగతి విద్యార్థులకు మార్కులను కేటాయించేందుకు సీబీఎ్‌సఈ ఇటీవలే ఓ విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విధానం ప్రకారం ప్రతీ సబ్జెక్టుకు ఇంటర్నల్‌ పరీక్షల ఆధారంగా 20 మార్కులు,  మిగతా 80 మార్కులను ఆ విద్యా సంవత్సరంలో విద్యార్థి ప్రదర్శన ఆధారంగా కేటాయిస్తారు.

Updated Date - 2021-05-19T07:52:20+05:30 IST