Abn logo
Sep 26 2021 @ 23:17PM

బడికి వెళ్లకపోవడంతో తండ్రి మందలించాడని విద్యార్థి అత్మహత్య..!

మృతుడు గిరీశ్‌ కుమార్‌ (పైల్‌ఫొటో)

కలకడ, సెప్టెంబరు 26: పాఠశాలకు సక్రమంగా వెళ్లకపోవడంతో తండ్రి మందలించినందుకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. హెచ్‌సీ నాగరాజు కథనం మేరకు.. మండలంలోని ఎనుగొండపాళెం పంచాయతీ దిగువపాళెంకు చెందిన వెంకటాచలపతి కుమారుడు గిరీష్‌ కుమార్‌(15) గుర్రంకొండ మండలం మర్రిపాడు హైస్కూల్‌లో పదో తరగతి చదువు తున్నాడు. 15 రోజుల నుంచి గిరీష్‌కుమార్‌ పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండడంతో తండ్రి మందలించాడు. మనస్తా పానికి గురైన అతడు ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. గమనించిన నానమ్మ గట్టిగా అరవ డంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని కిందకు దించారు. అపస్మారక స్థితిలో ఉండడంతో వాల్మీకిపురం ప్రభుత్వ ఆస్ప త్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.