పదికి సిద్ధం

ABN , First Publish Date - 2020-06-01T09:37:39+05:30 IST

పది పరీక్షల షెడ్యూల్‌ ప్రకటనతో గత కొద్ది రోజులుగా స్థబ్ధంగా ఉన్న విద్యార్థుల్లో ఒక విధమై న టెన్షన్‌ మొదలైనంది. అటు అధికార

పదికి సిద్ధం

పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి  

ప్రభుత్వ ఆదేశాల మేరకు షెడ్యూల్‌ ప్రకటన

పరీక్షలు రాసేందుకు సంసిద్ధమవుతున్న విద్యార్థులు

కరోనా దృష్ట్యా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు

ఈనెల 8వ తేదీ నుంచి టెన్త్‌ పరీక్షలు 

జిల్లావ్యాప్తంగా 46 సెంటర్లకు గాను.. 25 అదనం


నిర్మల్‌ కల్చరల్‌, మే 31: పది పరీక్షల షెడ్యూల్‌ ప్రకటనతో గత కొద్ది రోజులుగా స్థబ్ధంగా ఉన్న విద్యార్థుల్లో ఒక విధమై న టెన్షన్‌ మొదలైనంది. అటు అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు పది పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమైంది. లాక్‌ డౌన్‌, కరోనా విస్తృత నేపథ్యంలో కేవలం మూడు పరీక్షలు నిర్వహించి పది పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే మిగతా పరీక్షలు ఎప్పు డు నిర్వహిస్తారో? తెలియని పరిస్థితు ల్లో విద్యార్థులుండగా.. పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేయడంతో  విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సంసిద్ధులవుతున్నారు. 


పకడ్బందీ ఏర్పాట్లు

జిల్లాలో పది పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికార్లు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్‌ దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రాల సంఖ్య పెంచడంతో పాటు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గతంలో జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలుండగా.. అదనంగా 25కేంద్రాలు కొత్తగా ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ఒక్కో గదిలో 20 నుంచి 25 మంది విద్యార్థులను కేటాయించి భౌతిక దూరం పాటించేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఛీప్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్ల సంఖ్య కూడా పెంచారు. తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు రానుండటంతో ప్రత్యేకంగా షామియానాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. 


నో మాస్క్‌.. సెంటర్‌లోకి నో ఎంట్రీ

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సి ఉంటుంది. లేనట్లయితే పరీక్షా గదిలోకి అనుమతించరు. సిబ్బంది సైతం మాస్క్‌లు ధరించాల్సి ఉంటుంద. అంతేకాకుండా పరీక్షా కేంద్రాలు రసాయన ద్రావణంతో శుభ్రం చేయడం తప్పనిసరి. ఇక శానిటైజర్‌ను ప్రవేశ ద్వారా వద్ద అందుబాటులో ఉంచాలి. గదిలోకి వెళ్లే ప్రతీ విద్యార్థికి ఽథర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తారు.


జిల్లాలో మొత్తం 71 కేంద్రాలు

భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్‌ ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో మొత్తం జిల్లా వ్యాప్తంగా 71 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో 46 కేంద్రాలుండగా.. కరోనా ప్రత్యేక చర్యల్లో భాగంగా 25 అదనపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 9,802 రెగ్యూలర్‌ 225 ప్రైవేట్‌ విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. 


జూలై 5వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ

ఈనెల 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. దీనిలో భాగంగా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు పరీక్ష నిర్వహిస్తారు. అయితే, లాంగ్వేజ్‌ పరీక్షలను మాత్రం 12:45 వరకు నిర్వహిస్తారు. జూలై 5వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయి. పరీక్షా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలి.

Updated Date - 2020-06-01T09:37:39+05:30 IST