టర్మ్‌ ఇన్సూరెన్స్‌ మరింత ప్రియం!

ABN , First Publish Date - 2020-04-03T06:16:28+05:30 IST

జీవిత బీమా టర్మ్‌ పాలసీలు మరింత ప్రియం కానున్నాయని ఇన్సూరెన్స్‌ బ్రోకర్లంటున్నారు. ఈ నెల 1 (బుధవారం) నుంచే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియం పెరగాల్సి...

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ మరింత ప్రియం!

  • 154 శాతం పెరగనున్న ప్రీమియం?
  • ఈ నెల 10 నుంచి అమల్లోకి వచ్చే చాన్స్‌ 


జీవిత బీమా టర్మ్‌ పాలసీలు మరింత ప్రియం కానున్నాయని ఇన్సూరెన్స్‌ బ్రోకర్లంటున్నారు.   ఈ నెల 1 (బుధవారం) నుంచే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియం పెరగాల్సి ఉండగా,  కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నెల 10కి వాయిదా పడిందని సమాచారం. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రస్తుత ప్రీమియం రేటు మరికొద్ది రోజులే అందుబాటులో ఉండనుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. 


ఎంత పెరగొచ్చు..?

ఇన్సూరెన్స్‌ కంపెనీని బట్టి ప్రీమియం పెంపు 15 శాతం నుంచి 40 శాతం వరకు ఉండవచ్చు.


ఎందుకు పెంపు?

ఇన్సూరెన్స్‌ కంపెనీలకు చెల్లించాల్సిన చార్జీలు పెరిగిన నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఏటేటా క్లెయిమ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్‌ కంపెనీలు ప్రీమియం పెంచడంతో ఇప్పుడు జీవిత బీమా కంపెనీలకూ పెంచక తప్పడం లేదు. 


వాహన, ఆర్యోగ బీమా రెన్యువల్‌కు అదనపు గడువు 

లాక్‌డౌన్‌ సమయంలో (మార్చి 25 - ఏప్రిల్‌ 14) వాహన థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ రెన్యువల్‌ ముగిసే వారికి ప్రభుత్వం కొంత ఊరట కల్పించింది. వాహన యజమానులు పాలసీ రెన్యువల్‌ ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 21 వరకు గడువు కల్పిస్తూ ఐఆర్‌డీఏఐ సర్క్యులర్‌ జారీ చేసింది. 

లాక్‌డౌన్‌ సమయంలో కాలపరిమితి ముగియనున్న ఆరోగ్య బీమా పాలసీల రెన్యువల్‌కు ఏప్రిల్‌ 21 వరకు గడువు కల్పించాలని ఇన్సూరెన్స్‌ కంపెనీలను కోరింది.


ప్రీమియాన్ని నిర్ణయించే అంశాలు

  • దేశంలో ప్రజల మరణాల రేటు
  • అప్పటివరకున్న ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ల రేటు 
  • పాలసీ హోల్డర్‌ వయసు
  • వృత్తిపరమైన, వ్యక్తిగత రిస్క్‌
  • రీఇన్సూరర్‌ భరించే రిస్క్‌, వసూలు చేసే ప్రీమియం


రీ-ఇన్సూరర్‌ అంటే? 

ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఆర్థిక మద్దతునిచ్చేవే రీ-ఇన్సూరెన్స్‌ సంస్థలు. బీమా సంస్థలు విక్రయించే టర్మ్‌ పాలసీల రిస్క్‌లో కొంత భాగాన్ని రీ-ఇన్సూరర్లు భరిస్తాయి. అంటే, బీమా సంస్థల  వ్యాపార రిస్క్‌కు బీమా కవరేజీ కల్పించేవే రీ-ఇన్సూరెన్స్‌ కంపెనీలు. 


ప్రయోజనాలు 

తక్కువ ప్రీమియం.. అధిక కవరేజీ 

భవిష్యత్‌కు భద్రత 

ఆపత్కాలంలో కుటుంబానికి రక్షణ 

ఆర్థిక స్థిరత్వం 

జీవిత బీమాతోపాటు యాక్సిడెంట్‌, అనారోగ్యానికీ కవరేజీ ఎంచుకునే అవకాశం 


Updated Date - 2020-04-03T06:16:28+05:30 IST