నిబంధనలు కఠినతరం

ABN , First Publish Date - 2020-04-05T11:00:57+05:30 IST

గద్వాల జిల్లా కేంద్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు.

నిబంధనలు కఠినతరం

కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టిన పోలీసులు 

జిల్లా వ్యాప్తంగా 230 వాహనాలు సీజ్‌, 560 వాహనాలపై కేసులు 

 

గద్వాల, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి)/కేటీదొడ్డి/ఇటిక్యాల/అయిజ/గద్వాల క్రైం: గద్వాల జిల్లా కేంద్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో పోలీసులు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని, వాహనాల్లో తిరగరాదని ఎన్నిమార్లు చెప్పినా వినడం లేదు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అవసరం లేకున్న బయటకు వచ్చిన వాహనాలను సీజ్‌ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గద్వాల జిల్లా వ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 230 వాహనాలను  సీజ్‌ చేశారు. 560 వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఇటిక్యాలలో  11 వాహనాలను సీజ్‌ చేశారు. అయిజలో శనివారం 30 వాహనాలను సీజ్‌ చేశా రు. కాగా, గద్వాల పట్టణంలోని మోమిన్‌మహల్లాలో ఆశావర్కర్ల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. మరోపక్క మసీదులో సామూహికంగా ప్రార్థనలు చేస్తున్న 15 మందిపై కేసులు నమోదు చేశారు. కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన వార్డులను పూర్తిగా దిగ్బంధనం చేశారు. బయటకు ఎవరిని రానివ్వడం లేదు. ఆ వార్డుల్లో మునిసిపాలిటీ నుంచి పా లు, కూరగాయలు సరఫరా చేస్తామని చెప్పారు కాని.. ఇంత వరకు పంపిణీ చేయలేదని పలువురు వాపోతున్నారు. మరో పక్క రెండు రోజులుగా రేషన్‌ షాపుల్లో బియ్యం పంపిణీ చేస్తుండగా పాత హౌసింగ్‌బోర్డు కాలనీలో మాత్రం పంపిణీ చేయడం లేదని పలువురు లబ్ధిదారులు ఆవేద న వ్యక్తం చేశారు. 


క్వారంటైన్‌ వద్ద...

కరోనా అనుమానితులను ఉంచిన క్వారంటైన్‌ వద్ద కూడా పో లీసు బందోబస్తును పెంచారు. జిల్లాలో ఇప్పటి వరకు ఉండవల్లి క్వారంటైన్‌లో 39 మంది, ఇటిక్యాలలో 79 మంది, గద్వాల ఆస్ప త్రిలో 29 మందికి చికిత్స అందిస్తున్నారు. క్వారం టైన్ల వద్ద ఎవ రిని బయటకు రానివ్వడం లేదు. కలెక్టర్‌ శృతి ఓఝా, అదనపు కలెక్టర్‌ శ్రీని వాసరెడ్డి, ఆర్డీవో రాములు ఎప్పటికప్పుడు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 


ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు

 లాక్‌డౌన్‌ నిబంధనలను ధిక్కరించిన కేటీదొడ్డి మండలంలోని తూర్పు తండాకు చెందిన రాజునాయక్‌, లోకేష్‌నాయక్‌, గుండునాయక్‌పై కేసు నమో దు చేసినట్లు ఎస్‌ఐ బాలవెంకటరమణ తెలిపారు. వీరు ఇళ్లలో ఉండకుండా బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను దిక్కరించారన్నారు. అలాగే ఒక కారు, ఐదు ద్విచక్రవాహనాలను సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ బాల వెంకటరమణ తెలిపారు.  


నందిన్నె చెక్‌పోస్ట్‌ను పరిశీలించిన డీపీవో 

 జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ శనివారం కేటీదొడ్డి మండల కేంద్రంలో పర్యటించారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో ఉన్న నందిన్నె చెక్‌పోస్ట్‌ను ఎంపీడీవో జయరామ్‌నాయక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీవో కృష్ణ మాట్లాడుతూ ప్రజలు ఎవ్వరూ కూడా రోడ్లపై తిరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కేటీదొడ్డిలో రేషన్‌ బియ్యం పంపిణీని పర్యవేక్షించారు. ఉమిత్యాల గ్రామంలోని నర్సరీని పరిశీలించి నిర్వాహకులకు  సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మస్తాన్‌వల్లి, శివశంకర్‌, వైద్య సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.   

Updated Date - 2020-04-05T11:00:57+05:30 IST