మంత్రం భయంతో ఎంత ఘోరం జరిగిందో..

ABN , First Publish Date - 2020-05-22T22:50:41+05:30 IST

మూఢనమ్మకాలను, మంత్రాలను నమ్మొద్దని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా..

మంత్రం భయంతో ఎంత ఘోరం జరిగిందో..

కామారెడ్డి జిల్లా: మూఢనమ్మకాలను, మంత్రాలను నమ్మొద్దని ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా లాభం లేకుండా పోతోంది. కొన్ని ప్రాంతాల్లో మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో దాడులకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటన కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో జరిగింది. మంత్రాలు చేస్తున్నారనే నెపంతో రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలుతోపాటు ఆమె కుమార్తెను స్థానికంగా ఉండే ఒకే కుటుంబానికి చెందినవారు చితకబాదారు. ఈ సంఘటనలో తల్లీ కుమార్తె ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు.


రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన పోతారం లింబవ్వ, తన కొడుకు రాజు, కోడలు వనిత, కుమార్తె సావిత్రితో కలిసి గత 25 ఏళ్లుగా లక్ష్మినగర్ కాలనీలో నివాసం ఉంటోంది. అయితే అదే కాలనీలో నివాసం ఉండే త్యాగాల పెద్దలింబయ్య మనవరాలు అనారోగ్యంపాలైంది. దీంతో లింబవ్వ మంత్రాలు చేయడంతోనే తన మనవరాలు అనారోగ్యం బారిన పడిందని అనుమానం వ్యక్తం చేస్తూ.. పెద్ద లింబయ్య తన కుటుంబ సభ్యులు 8 మంది కలిసి లింబవ్వ ఇంటిపైకి దాడికి వెళ్లారు. దీంతో లింబవ్వ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లింబవ్వ, సావిత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - 2020-05-22T22:50:41+05:30 IST