ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2021-12-06T06:21:28+05:30 IST

: జగిత్యాల జిల్లా కోరుట్ల మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ సరిహద్దులోని జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు(అన్నదమ్ములు), కారు డ్రైవర్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

ఘోర రోడ్డు ప్రమాదం
మృతులు అజన్‌, అషార్‌,సాజిద్‌ అలి


- ఆర్టీసీ బస్సు కారు ఢీ.. అన్నదమ్ములు, కారు డ్రైవర్‌ మృతి

- ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు


కోరుట్ల రూరల్‌ / మేడిపల్లి డిసెంబరు 5 : జగిత్యాల జిల్లా కోరుట్ల మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ సరిహద్దులోని జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు(అన్నదమ్ములు), కారు డ్రైవర్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. 


కోరుట్ల పట్టణంలోని బిలాల్‌పుర ప్రాంతానికి చెందిన జావిద్‌ బిన్‌ సులేమాన్‌ బావమరిది వివాహం ఈనెల 29న ఉండటంతో భార్య - సమయ్య అమ్రీన్‌, కుమారులు మహ్మద్‌ అనాస్‌, ఎండి అషార్‌, ఎండి అజాన్‌లతో కలిసి తమ ఇంటి సమీపంలో ఉన్న కారు కిరాయికి మాట్లాడుకుని శనివారం ఉదయం హైదరాబాదుకు షాపింగ్‌కు వెళ్లారు. షాపింగ్‌ ముగించుకుని ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి తిరుగు పయణం అయ్యారు. మేడిపల్లి నుంచి కోరుట్ల వైపు వస్తుండగా రెండు మండలాల సరిహద్దులో కోరుట్ల నుంచిజగిత్యాల వైపు వెలుతున్న పల్లె వెలుగు బస్సు, కారు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారు డ్రైవర్‌ సాజిద్‌(35), చిన్నారి ఎండి అజన్‌(5) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. కారులో ఉన్న ఎండి అషార్‌, ఎండి అనాస్‌, సమయ్య అమ్రీన్‌, జావీద్‌ బిన్‌ సులేమాన్‌లు తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. బస్సును బలంగా ఢీకొట్టడంతో క్షతగాత్రులు కారులోనే ఇరుకున్నారు. స్థానికుల సహాయంలో వారిని బయటకు తీసారు. సమాచారం తెలియడంతో కోరుట్ల, మేడిపల్లి పోలీసులతో పాటు 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చెపట్టారు. క్షతగాత్రులను జగిత్యాల అసుపత్రికి తరలిస్తుడంగా మార్గ మధ్యలో ఎండి అషార్‌(9) మృతి చెందాడు. బస్సులో ప్రయాణం చేస్తున్న ఇద్దరు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన దంపతులతో పాటు కుమారుడు జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్థుతం దంపతుల పరిస్థితి నిలకడగానే ఉండగా మరో కుమారుడు అనాస్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు ఆసుప్రతి వద్ద మిన్నంటాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

కారులో ఇరుకున్న క్షతగాత్రులు

- ఉడిన బస్సు ముందటి టైర్‌

ప్రమాద తాకిడికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోంది. బస్సు ముందు టైర్‌ ఉడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న దంపతులతో పాటు వారి ముగ్గురు పిల్లలు, డ్రైవర్‌ కారులోనే ఇరుక్కుపోయారు. గమనించి న ప్రయాణికులు వారిని బయటకు తీయడానికి నానా తంటాలను పడ్డారు. సంఘటనలో డ్రైవర్‌తో పాటు మృతి చెందిన చిన్నారి కారు బానెట్‌లో పడటంతో బయటకు తీయడానికి ఇబ్బంది కరంగా మారింది. అదే విధంగా సమయ్య అమ్రీన్‌ దంపతులతో పాటు వారి ఇద్దరు కుమార్‌లు అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం గమనించిన ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది సంఘటనా స్థలానికి  చేరుకుని వారికి ప్రథమ చికిత్స చేసి జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రమాద తీవ్రతను చూసి సొమ్మసిల్లి పడిపోయింది.  

Updated Date - 2021-12-06T06:21:28+05:30 IST